AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Almond Butter: ఇంట్లోనే ఈజీగా హెల్దీగా బాదం బటర్ చేసేయండి..

బాదం బటర్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సమయం లేనప్పుడు చక్కగా బ్రెడ్ టోస్ట్ లేదా కాల్చుకుని తింటూ ఉంటారు. వాటి కంటే ఆ బ్రెడ్‌పై బాదం బటర్ రాసుకుని తింటే మరింత ఆరోగ్యం. తినేసి వెళ్లొచ్చు. బాదం పప్పు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా మంది బాదం బటర్ బయట మార్కెట్లో కొంటూ ఉంటారు. వాటిల్లో ఏం కలుపుతారో.. ఎలా తయారు చేస్తారో..

Almond Butter: ఇంట్లోనే ఈజీగా హెల్దీగా బాదం బటర్ చేసేయండి..
Badam Butter
Chinni Enni
| Edited By: |

Updated on: Aug 13, 2024 | 8:59 PM

Share

బాదం బటర్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సమయం లేనప్పుడు చక్కగా బ్రెడ్ టోస్ట్ లేదా కాల్చుకుని తింటూ ఉంటారు. వాటి కంటే ఆ బ్రెడ్‌పై బాదం బటర్ రాసుకుని తింటే మరింత ఆరోగ్యం. తినేసి వెళ్లొచ్చు. బాదం పప్పు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా మంది బాదం బటర్ బయట మార్కెట్లో కొంటూ ఉంటారు. వాటిల్లో ఏం కలుపుతారో.. ఎలా తయారు చేస్తారో.. అన్న భయం ఉంటుంది. కాబట్టి అదే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు తయారు చేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఈ బాదం బటర్ ఎలా తయారు చేస్తారు? ఏం పదార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బాదాం బటర్‌కు కావాల్సిన పదార్థాలు:

బాదం, ఉప్పు, దాల్చిన చెక్క పొడి, వెనీలా ఎసెన్స్, తేనె.

బాదాం బటర్‌ తయారీ విధానం:

ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. ఇది వేడెక్కాక బాదాం పప్పులను ఓ ఐదు నిమిషాల పాటు వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. వీటిని బాగా చల్లార్చు కోవాలి. వీటిల్లో ఓ గుప్పెడు బాదం పప్పులను తీసుకుని మిక్సీలో వేసి ఓ రెండు సార్లు తిప్పండి. అవి చిన్న చిన్న ముక్కలుగా అవుతాయి. వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన బాదం ముక్కలను మిక్సీలో వేసి బాగా పొడిలా మెత్తగా చేసుకోవాలి. మీకు ఇవి పేస్టులా రాకపోతే.. ఓ రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసి మిక్సీ పట్టండి.. మెత్తగా వెన్నలాగా పేస్టు అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఇందులో తేనె, ఉప్పు కొద్దిగా, దాల్చిన చెక్క పొడి కొద్దిగా, వెనీలా ఎసెన్స్ కొద్దిగా వేసి మళ్లీ మిక్సీ పట్టండి. అంతే ఎంతో రుచిగా ఉండే ఆల్మండ్ బటర్ సిద్ధం. ముందుగా చిన్న పలుకులు చేసి పెట్టుకున్న బాదం ముక్కలను పేస్టులో కలిపేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఓ గాజు సీసాలో వేసి ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇలా ఎప్పటికప్పుడు మనమే ఇంట్లోనే హెల్దీగా బాదం బటర్ సిద్ధం చేసుకోవచ్చు.

Follow Us