Donkeys Marriage: కర్నాటకలో వైభవంగా గాడిదలకు పెళ్ళి.. చూసేందుకు ఎగబడ్డ జనం.
దేశంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. కొన్నిచోట్ల వాన దంచి కొట్టి.. వరదల బీభత్సం కొనసాగుతుంటే.. మరొకొన్ని చోట్ల వరుణుడి జాడే కనిపించడం లేదు. అటు కర్నాటకలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా బెంగళూరులో ఆగస్ట్ 11న భారీ వర్షం కురిసింది. ఆగస్ట్ 12, సోమవారం ఉదయం కూడా వర్షం పడటంతో.. పలు ప్రాంతాలను వదరనీరు ముంచెత్తింది.
దేశంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. కొన్నిచోట్ల వాన దంచి కొట్టి.. వరదల బీభత్సం కొనసాగుతుంటే.. మరొకొన్ని చోట్ల వరుణుడి జాడే కనిపించడం లేదు. అటు కర్నాటకలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా బెంగళూరులో ఆగస్ట్ 11న భారీ వర్షం కురిసింది. ఆగస్ట్ 12, సోమవారం ఉదయం కూడా వర్షం పడటంతో.. పలు ప్రాంతాలను వదరనీరు ముంచెత్తింది. కానీ చిత్రదుర్గకు సమీపంలోని ఓ గ్రామంలో వర్షాలు పడక రైతులు అల్లాడిపోతున్నారు. దీంతో వర్షం కోసం ప్రజలు గాడిదకు పెళ్లి చేశారు. చిత్రదుర్గం దొడ్డఉల్లార్తి గ్రామంలో వర్షం కోసం ప్రార్థనలు చేసి గాడిదలకు పెళ్లి చేశారు. జిల్లాలోని చల్లకెరె తాలూకా దొడ్డ ఉల్లార్తి గ్రామంలో ఈ ఘటన జరిగింది. చల్లకెరె తాలూకాలో చాలా రోజుల నుంచి వర్షాలు పడకపోవడంతో.. వ్యవసాయ పనులు ముందుకు సాగటం లేదు. దీంతో వర్షం కోసం గ్రామస్థులు గాడిదకు పెళ్లి చేశారు. ఒక గాడిదలకు సంప్రదాయబద్ధంగా వివాహం చేసి వర్షం కోసం ప్రార్థిస్తారు. ఇది ఇక్కడ పురాతనమైన ఆచారంగా గ్రామస్థులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.