Peacock Curry: చికెన్‌ వండి నెమలి కూర అంటూ ప్రచారం.. యూట్యూబర్‌ అరెస్ట్‌.!

Peacock Curry: చికెన్‌ వండి నెమలి కూర అంటూ ప్రచారం.. యూట్యూబర్‌ అరెస్ట్‌.!

Anil kumar poka

|

Updated on: Aug 13, 2024 | 9:01 PM

చికెన్‌ వండి నెమలి కూర అంటూ ప్రచారం చేసిన వ్యక్తిని ఆదివారం అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్‌కుమార్‌ శ్రీటీవీ యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహిస్తున్నాడు. చికెన్‌ కర్రీ వండి నెమలిని తను పట్టుకున్నట్లు గ్రాఫిక్స్‌తో ఫొటో తయారు చేసి, నెమలి కూర సంప్రదాయ పద్ధతిలో ఇలా వండాలంటూ వంటకాన్ని సిద్ధం చేసి యూట్యూబ్‌లో అప్లోడ్‌ చేశాడు.

చికెన్‌ వండి నెమలి కూర అంటూ ప్రచారం చేసిన వ్యక్తిని ఆదివారం అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్‌కుమార్‌ శ్రీటీవీ యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహిస్తున్నాడు. చికెన్‌ కర్రీ వండి నెమలిని తను పట్టుకున్నట్లు గ్రాఫిక్స్‌తో ఫొటో తయారు చేసి, నెమలి కూర సంప్రదాయ పద్ధతిలో ఇలా వండాలంటూ వంటకాన్ని సిద్ధం చేసి యూట్యూబ్‌లో అప్లోడ్‌ చేశాడు. దీనిపై నెటిజన్ల నుంచి వ్యతిరేక కామెంట్లు రావడంతో వెంటనే డిలేట్‌ చేశాడు. ఈ సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా కోడి ఈకలు, చికెన్‌ కూరను స్వాధీనపరచుకున్నామని, వాటిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు సిరిసిల్ల జిల్లా అటవీ అధికారి కల్పనా దేవి తెలిపారు. నెమలి కూర అని తేలితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. నెమలి కాకపోతే సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినందుకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు అప్పగిస్తామని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.