Crime: ఫోన్ ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది.. కరెంట్ హీటర్‌ను చంకలో పెట్టుకుని..
ఒకవైపు ఫోన్ మాట్లాడుతూ.. యథాలాపంగా మరో పని చేసే అలవాటున్న వారికి హెచ్చరిక లాంటి వార్త ఇది. మొబైల్ ఫోన్ మాట్లాడుతున్న ఓ వ్యక్తి.. అనాలోచితంగా విద్యుత్ హీటర్‌ను చంకలో పెట్టుకోవడంతో షాక్ తిని మృతిచెందారు. ఖమ్మంలో జరిగిన ఈ ఘటనపై మూడో పట్టణ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రమేశ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక కాల్వ ఒడ్డునున్న హనుమాన్ గుడి సమీపంలో దోనెపూడి మహేశ్‌బాబు కొబ్బరికాయల వ్యాపారం చేస్తుంటారు.
ఒకవైపు ఫోన్ మాట్లాడుతూ.. యథాలాపంగా మరో పని చేసే అలవాటున్న వారికి హెచ్చరిక లాంటి వార్త ఇది. మొబైల్ ఫోన్ మాట్లాడుతున్న ఓ వ్యక్తి.. అనాలోచితంగా విద్యుత్ హీటర్‌ను చంకలో పెట్టుకోవడంతో షాక్ తిని మృతిచెందారు. ఖమ్మంలో జరిగిన ఈ ఘటనపై మూడో పట్టణ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రమేశ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక కాల్వ ఒడ్డునున్న హనుమాన్ గుడి సమీపంలో దోనెపూడి మహేశ్‌బాబు కొబ్బరికాయల వ్యాపారం చేస్తుంటారు. నిన్న రాత్రి 8.30 గంటల సమయంలో ఆయన ఇంట్లో పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు వేడినీళ్ల కోసం హీటర్ ఆన్ చేయబోయారు. ఈలోగా ఫోన్ రావడంతో మాట్లాడుతూ.. హీటర్‌ను నీటిలో బదులు చంకలో పెట్టుకుని స్విచ్ ఆన్ చేశారు. దీంతో విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయారు. దగ్గర్లో ఉన్న ఆయన తొమ్మిదేళ్ల కుమార్తె శభన్య భయంతో కేకలు వేస్తూ పరుగెత్తింది. దీంతో అప్రమత్తమైన భార్య దుర్గాదేవి, స్థానికులు మహేశ్‌బాబును ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మహేశ్‌బాబు దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.