ఆ సమస్యలు ఉంటె అరటి పండు జోలికి వెళ్లొద్దు..

TV9 Telugu

13 August 2024

అరటి పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరంలో తక్షిణ శక్తిని అందించడమే కాకుండా..బరువును తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

అలాగే గుండెను రక్షిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గించడమే కాకుండా.. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేసి అజీర్ణం సమస్యను తగ్గిస్తుంది.

అరటి పండ్లలో కాల్షియం అధికంగా ఉంటుంది. అందుకే చలికాలంలో అరటి పండ్లను తీసుకోవడం వలన ఎముకలు బలంగా ఉంటాయి.

అలాగే బరువు అదుపు చేయడంలో సహాయపడుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది. గుండెజబ్బులను తగ్గించడంలోనూ అరటి పండ్లు ఉపయోగపడుతాయి.

వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటు పెరగదు. అరటి పండ్లలలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.

కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ఇది అందరికి చాలా మంచిది ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్, జీర్ణ కోశ సంబంధిత సమస్యలను రాకుండా చేస్తుంది.

అదే విధంగా జీర్ణాశయానికి మేలు చేసే బ్యాక్టీరియా ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఇక సైనస్ సమస్య ఉన్నవారు అరటి పండ్లను అస్సలు తినకూడదు.

వీరు అరటి పండు తినడం వలన శరీరంలో శ్లేష్మం ఎక్కువగా పేరుకుపోతుంది. అలాగే జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడేవారు అరటి పండ్లకు తినకూడదు.