AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack Symptoms: ఈ లక్షణాలు కూడా గుండెపోటుకు కారణాలు.. జాగ్రత్త పడండి..

గుండె పోటుతో వృద్ధులే కాకుండా వయసున్న వారు కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో సైలెంట్ హార్ట్ ఎటాక్స్ అనేవి బాగా ఎక్కువ అవుతున్నాయి. దీన్నే సడెన్ కార్డియాక్ అరెస్ట్ అని కూడా అంటారు. అయితే హార్ట్ ఎటాక్ అనేది అందరికీ రాదు. ప్రతీసారి కూడా జరగదు. ఒక్కోసారి ధమనుల్లోని సమస్యల వల్ల హార్ట్ ఎటాక్ అనేది వస్తుంది. అసలు గుండె నొప్పి వస్తుందన్న విషయం కూడా మీకు సరిగ్గా తెలీదు. కానీ ఈ సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలను..

Heart Attack Symptoms: ఈ లక్షణాలు కూడా గుండెపోటుకు కారణాలు.. జాగ్రత్త పడండి..
Heart Attack
Chinni Enni
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 20, 2024 | 10:00 PM

Share

గుండె పోటుతో వృద్ధులే కాకుండా వయసున్న వారు కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో సైలెంట్ హార్ట్ ఎటాక్స్ అనేవి బాగా ఎక్కువ అవుతున్నాయి. దీన్నే సడెన్ కార్డియాక్ అరెస్ట్ అని కూడా అంటారు. అయితే హార్ట్ ఎటాక్ అనేది అందరికీ రాదు. ప్రతీసారి కూడా జరగదు. ఒక్కోసారి ధమనుల్లోని సమస్యల వల్ల హార్ట్ ఎటాక్ అనేది వస్తుంది. అసలు గుండె నొప్పి వస్తుందన్న విషయం కూడా మీకు సరిగ్గా తెలీదు. కానీ ఈ సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలను కూడా శరీరం కొన్ని లక్షణాల ద్వారా తెలియజేస్తుంది. మరి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో.. ఇప్పుడు తెలుసుకుందాం.

చెమటలు అధికంగా పడతాయి:

సైలెంట్ హార్ట్ ఎటాక్ వస్తుంది అనడానికి చెమటలు కూడా ఒక కారణం. ఎలాంటి శ్రమ, ఆందోళన లేకుండా చెమటలు ఎక్కువగా పడితే మాత్రం అది హార్ట్ ఎటాక్‌ రావడానికి కారణం అని తెలుసుకోండి. అలాగే వికారం, నార్మల్‌గా తలనొప్పి ఉందనిపిస్తే సైలెంట్ హార్ట్ ఎటాక్ అని చెప్పొచ్చు. అంతే కాకుండా మెదడుకు రక్త ప్రసరణ కూడా తగ్గడం వల్ల స్పృహ కోల్పోయినట్లుగా అనిపిస్తుంది.

గుండె నొప్పి:

సైలెట్ మార్ట్ ఎటాక్ రావడానికి కామన్‌గా కనిపించే పాయింట్ ఏంటంటే.. గుండెల్లో నొప్పి. ఛాతీలో నొప్పి వచ్చి చాలా అసౌకర్యంగా, ఒత్తిడిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే మీకు గుండెల్లో నొప్పిగా ఉందనిపిస్తే వెంటనే వైద్యుల్ని కలవడం మంచిది.

ఇవి కూడా చదవండి

అలసట:

అలసట కూడా సైలెంట్ హార్ట్ ఎటాక్‌కి లక్షణంగా చెప్పొచ్చు. ఎక్కువగా పని ఎక్కువైనా, నిద్ర సరిగ్గా లేకపోయినా అలసటగా అనిపిస్తుంది. సాయంత్రానికి ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ ఎలాంటి శ్రమ, ఒత్తిడి, పని లేకుండా అలిసిపోయినట్లు అనిపిస్తే.. వైద్యుల్ని కలవండి.

కండరాల్లో నొప్పులు:

కండరాల్లో నొప్పులు ఎక్కువగా వస్తున్నా కూడా సైలెంట్ హార్ట్ ఎటాక్‌ లక్షణం. మెడ, దవడ, చేతులు, భుజాలు, వీపులో నొప్పులు కనిపిస్తాయి. అలాగే పొత్తి కడుపు దిగువ భాగాన కూడా నొప్పి వచ్చి తగ్గిపోతూ ఉంటుంది.

ఊపిరి ఆడకపోవడం:

ఊపిరి సరిగా ఆడక పోవడం, తల తిరిగినట్లుగా అంటే కళ్లు తిరుగుతున్నట్లుగా ఉన్నా సైలెంట్ హార్ట్ ఎటాక్‌కి లక్షణంగా చెప్పొచ్చు. అంతే కాకుండా మైకంగా, అలసట, శ్వాస సమస్యగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు అశ్రద్ధ చేయకండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ఉన్నది పోయే.. ఉంచుకున్నది పోయే.. పాపం.! ఈ ఎస్సై పరిస్థితి చూస్తే
ఉన్నది పోయే.. ఉంచుకున్నది పోయే.. పాపం.! ఈ ఎస్సై పరిస్థితి చూస్తే
39 మ్యాచ్‌ల్లో 1109 పరుగులు.. టీమిండియా నయా ఛేజింగ్ మాస్టర్
39 మ్యాచ్‌ల్లో 1109 పరుగులు.. టీమిండియా నయా ఛేజింగ్ మాస్టర్
చేపలతో వీటిని కలిపి తింటే మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు ఖాయం..
చేపలతో వీటిని కలిపి తింటే మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు ఖాయం..
హైదరాబాద్‌లో ఒక్క రూపాయికే కడుపు నిండా భోజనం.. ఎక్కడో తెలుసా..?
హైదరాబాద్‌లో ఒక్క రూపాయికే కడుపు నిండా భోజనం.. ఎక్కడో తెలుసా..?
మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే.. ఎలాంటి వాస్తు దోషం అయినా ఇట్టే మాయం.
మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే.. ఎలాంటి వాస్తు దోషం అయినా ఇట్టే మాయం.
న్యూస్‌ పేపర్లలో ఫుడ్ తినడంపై ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తున్నారు?
న్యూస్‌ పేపర్లలో ఫుడ్ తినడంపై ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తున్నారు?
బొద్దింకలతో జర భద్రం..! లేదంటే..భయంకరమైన రోగాలకు స్వాగతం
బొద్దింకలతో జర భద్రం..! లేదంటే..భయంకరమైన రోగాలకు స్వాగతం
జియో న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. చౌకగా 3 కొత్త ప్లాన్స్‌..బెనిఫిట్స్ ఇవే
జియో న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. చౌకగా 3 కొత్త ప్లాన్స్‌..బెనిఫిట్స్ ఇవే
ఈ భామ బయట గత్తరలేపిందిగా..
ఈ భామ బయట గత్తరలేపిందిగా..
మీ కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్‌ అవ్వండి..
మీ కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్‌ అవ్వండి..