Hair Care Tips : జుట్టు వేగంగా పెరగడం లేదని చింతిస్తున్నారా..! అయితే ఈ ఏడు సహజ పద్ధతులను పాటించండి..
Hair Care Tips : పొడవాటి మెరిసే జుట్టు అందరికి కావాలి. కానీ తరచుగా పోషకాహారం లోపం వల్ల జుట్టు సహజంగా పెరగడం
Hair Care Tips : పొడవాటి మెరిసే జుట్టు అందరికి కావాలి. కానీ తరచుగా పోషకాహారం లోపం వల్ల జుట్టు సహజంగా పెరగడం ఆగిపోతుంది. మళ్లీ జుట్టు వేగంగా, బలంగా పెరగాలంటే మీరు ఈ పద్ధతులను అనుసరించవచ్చు.
1. కండీషనర్- కండీషనర్ వాడకం జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. దీన్ని ఉపయోగించడం ద్వారా జుట్టు తక్కువగా వస్తుంది. అందువల్ల హెయిర్ కండిషనింగ్ చేయడం అవసరం.
2. కత్తిరించడం- ప్రతి ఎనిమిది నుంచి పది వారాలకు క్రమం తప్పకుండా జుట్టు కత్తిరించడం వల్ల జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది.
3. హాట్ ఆయిల్ మసాజ్- మంచి వేడి నూనె మసాజ్ వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ప్రతి వారం వేడి నూనెతో మీ జుట్టుకు మసాజ్ చేయడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. దీని కోసం మీరు కొబ్బరి, ఆలివ్ లేదా లావెండర్ నూనెను ఉపయోగించవచ్చు. ఇది మీ జుట్టును అందంగా పెరగడానికి సహాయపడుతుంది.
4. ప్రతి రాత్రి బ్రష్ చేయడం- అధికంగా బ్రష్ చేయడం వల్ల జుట్టు రాలడం, జుట్టు దెబ్బతినడం జరుగుతుందని కొంతమంది చెబుతుతారు. కానీ రాత్రి పడుకునే ముందు దువ్వుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మూలాలు బలపడతాయి జుట్టు వేగంగా పెరుగుతుంది.
5. తడి జుట్టుకు క్లాత్ కట్టుకోకండి- షాంపూ చేసిన తర్వాత తడి జుట్టును టవల్‌లో చుట్టే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. తడి జుట్టును తువ్వాలుతో చుట్టడం వల్ల జుట్టు రాలడం ఎక్కువ అవుతుంది. ఈ సందర్భంలో మీరు మైక్రోఫైబర్ టవల్ ఉపయోగించవచ్చు.
6. ఒత్తిడిని తీసుకోకండి- ఒత్తిడి మీ ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావాలను కలిగిస్తుంది. పని లేదా వ్యక్తిగత సమస్యల వల్ల అధిక ఒత్తిడి వల్ల జుట్టు రాలడం జరుగుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం, యోగా సాధన చేయండి.
7. గుడ్డు మాస్కు ఉపయోగించి – మీరు గుడ్డు మాస్కును ఉపయోగించవచ్చు. మీ జుట్టును పోషించుకోవడానికి ఇది గొప్ప మార్గం. గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. గుడ్డులో ఒక చెంచా నూనె (ఆలివ్ ఆయిల్) కలపండి. మీ జుట్టు నెత్తిమీద రాయండి. దీన్ని 20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత షాంపూతో కడగండి. మీరు దీన్ని నెలకు ఒకసారి చేయవచ్చు.