AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motivational: జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే.. ఈ పనులు చేయండి..

ఒకప్పుడు జీవితాలు చాలా సింపుల్‌గా ఉండేవి. సంపాదన ఉన్నా, లేకున్నా ఉన్నదాంట్లో తృప్తిగా ఉండేవారు. అయతే ప్రస్తుతం జీవనశైలి పూర్తిగా మారిపోయింది. గజిబిజీగా మారిన ఈ జీవితాల్లో నిత్యం ఏదో తెలియన ఆందోళ, ప్రపంచంతో పోటీపడి పనిచేయాలన్నా కోరిక. అయితే పోటీపడి పనిచేయడం, జీవితంలో ముందుకుసాగడం ఎవరూ కాదనలేని అంశం. కానీ ఈ క్రమంలో...

Motivational: జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే.. ఈ పనులు చేయండి..
Peaceful Mind
Narender Vaitla
|

Updated on: Jul 09, 2024 | 7:20 AM

Share

ఒకప్పుడు జీవితాలు చాలా సింపుల్‌గా ఉండేవి. సంపాదన ఉన్నా, లేకున్నా ఉన్నదాంట్లో తృప్తిగా ఉండేవారు. అయతే ప్రస్తుతం జీవనశైలి పూర్తిగా మారిపోయింది. గజిబిజీగా మారిన ఈ జీవితాల్లో నిత్యం ఏదో తెలియన ఆందోళ, ప్రపంచంతో పోటీపడి పనిచేయాలన్నా కోరిక. అయితే పోటీపడి పనిచేయడం, జీవితంలో ముందుకుసాగడం ఎవరూ కాదనలేని అంశం. కానీ ఈ క్రమంలో మానసిక ప్రశాంతత కోల్పోతే ఇక జీవితానికి అర్థమే ఉండదని మానసిక నిపుణులు చెబుతున్నారు. మానసిక ప్రశాంతతను సొంతం చేసుకోవడానికి జీవన విధానంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

* జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ముందుగా పక్క వారితో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం మానేయాలని నిపుణులు చెబుతున్నారు. మీ పని మీరు చేసుకుంటే, నిన్నటి కంటే ఈరోజు.. ఈరోజుతో పోల్చితే రేపటికి ఎంతో కొంత డెవలప్‌మెంట్ ఉండేలా చూసుకుంటే ముందుకు సాగాలి. కానీ పక్కవారితో పోల్చుకోవడం.. ఇంకొకరిలో జీవించాలని కోరుకోవడం ప్రారంభిస్తే ఆ రోజే మీ ప్రశాంతత దెబ్బ తినడం ప్రారంభమవుతుంది.

* మనసు ప్రశాంతగా ఉండే డీప్‌ బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. గుండెల నిండా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఒత్తిడిలో ఉన్న సమయంలో ఇలా చేస్తే వెంటనే రిలీఫ్‌ లభిస్తుంది. డీప్‌ బ్రీత్‌లో ఆక్సిజన్‌ శరీరంలోకి వెళ్లి, మెదుడుకు చేరుకొని, స్వాంత పరుస్తుంది.

* ధ్యానం కూడా ఒత్తిడిని దూరం చేస్తుంది. మనసు ఇతర అంశాల మీదకు వెళ్లకుండా చేస్తుంది. దీంతో మనసు, శరీరం భారం నుంచి ఉపశమనం పొందిన భావన కలుగుతుంది. శరీరంలో కార్టిసాల్‌, అడ్రెనలిన్‌ అనే స్ట్రెస్‌ హార్మోన్ల ఉత్పత్తి తగ్గి, మానసిక ప్రశాంతత దక్కుతుంది.

* ప్రస్తుత కాలంలో నిద్రలేమి సమస్య ఎక్కువుతోంది. అయితే మంచి నిద్రతోనే మంచి మానసిక ఆరోగ్యం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమితో శరీరంలో ఒత్తిడిని పెంచే‌ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఆందోళన, చీకాకు పెరుగుతాయి. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. దీంతో ఇది ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది.

* ప్రశాంతత లభించాలంటే మంచి సంగీతం వినడాన్ని అలవాటు చేసుకోవాలి. ప్రతీ రోజూ ఉదయం, లేదా సాయంత్రం ఒక గంటపాటు నచ్చిన సంగీతం వింటే ఆందోళన స్థాయిలు తగ్గుతాయి, గుండె వేగం అదుపులోకి వస్తుంది.

* ప్రస్తుత డిజిట్‌ యుగంలో డిజిటల్‌ డిటాక్సిఫికేషన్‌ ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు. పని చేసే సమయంలో తప్ప ఖాళీ సమయంలో ఫోన్‌కు, ల్యాప్‌టాప్‌లకు కచ్చితంగా దూరంగా ఉండాలి.

* ఈ గజిబిజీ జీవితంలో మీకోసం కూడా కొంత సమయాన్ని కేటాయించుకోండి. అప్పుడప్పుడు లాంగ్ డ్రైవ్‌ వెళ్లడం, లేదా మొక్కలు నాటడం, అలా సరదగా చెప్పులు లేకుండా నడవడం వంటివి అలవాటు చేసుకోండి. ఇవి ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతతను ఇస్తాయి.

* ఇక అన్నింటి కంటే ప్రధానమైంది గతాన్ని మర్చిపోవడం. ప్రతీ మనిషి జీవితంలో మరిచిపోలేని, గుర్తొస్తే బాధపడే కొన్ని సంఘటనలు ఉంటాయి. అలాంటి వాటిని గుర్తు చేసుకుంటే కచ్చితంగా మానసిక ప్రశాంతత దూరమవుతుంది. కాబట్టి ఏది గుర్తు తెచ్చుకోవాలో, ఏది గుర్తు తెచ్చుకోకూడదో అనే విచక్షణను అలవాటు చేసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..