AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pimples Free Drink: మొటిమలు రాకుండా ఉండాలంటే.. ఈ డ్రింక్ తాగడం బెస్ట్!

ఎలాంటి మచ్చలు, మొటిమలు లేకుండా ముఖం అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. కేవలం అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా అందమైన చర్మం కావాలని కోరుకుంటారు. అందంగా ఉండాలని చాలా మంది మార్కెట్లో ఉండే ప్రోడెక్ట్స్‌ని యూజ్ చేస్తారు. కానీ భవిష్యత్తులో వీటితో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అలా కాకుండా ఇంట్లోనే నేచురల్ పద్దతులను ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందుకు కంజీ బాగా పని..

Pimples Free Drink: మొటిమలు రాకుండా ఉండాలంటే.. ఈ డ్రింక్ తాగడం బెస్ట్!
Pimples Free Drink
Chinni Enni
|

Updated on: Mar 01, 2024 | 3:39 PM

Share

ఎలాంటి మచ్చలు, మొటిమలు లేకుండా ముఖం అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. కేవలం అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా అందమైన చర్మం కావాలని కోరుకుంటారు. అందంగా ఉండాలని చాలా మంది మార్కెట్లో ఉండే ప్రోడెక్ట్స్‌ని యూజ్ చేస్తారు. కానీ భవిష్యత్తులో వీటితో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అలా కాకుండా ఇంట్లోనే నేచురల్ పద్దతులను ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందుకు కంజీ బాగా పని చేస్తుంది. ఈ డ్రింక్‌ని ఎలా తయారు చేస్తారు? చర్మ ఆరోగ్యానికి మెరుగు పరచడానికి ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి. దీన్ని చాలా మంది ఇండియన్ కొంబుచా అని పిలుస్తారు. క్యారెట్, ఆవాలు, మసాలాలతో కలిపి కంజీని తయారు చేస్తారు. కంజీని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రీఫ్రెష్‌గా ఉంటుంది. కంజీ డ్రింక్ తాగడం వల్ల కేవలం ఆరోగ్యమే కాకుండా.. అందాన్ని కూడా మెరుగు పరచుకోవచ్చు. కంజీని మీ డైట్‌లో యాడ్ చేసుకోవడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

యాంటీ ఏజింగ్:

కంజీ డ్రింక్‌లో ఫినాలిక్ సమ్మేళనాలు, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ని న్యూట్రల్ చేయడానికి సహాయ పడతాయి. అంతే కాకుండా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కంజీని రోజూ తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి. ఫైన్ లైన్స్, ముడతల రాకుండా చూడటంలో ఇది చక్కగా పని చేస్తుంది.

మెరిసే చర్మం:

చాలా మంది ముఖం, చర్మం అందంగా మెరవాలని కోరుకుంటారు. అలాంటి వారు కంజీని తాగవచ్చు. ఇందులో ఉండే విటమిన్లు సి, ఇ, పొటాషియం.. చర్మ కణాలకు పోషణ అందించి.. హైడ్రేట్‌గా ఉండేలా చేస్తుంది. దీంతో ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతం అవుతుంది. కంజీని తరచుగా క్రమం తప్పకుండా తాగితే.. మంచి స్కిన్ గ్లోయింగ్ చర్మం మీ సొంతం అవుతుంది.

ఇవి కూడా చదవండి

మొటిమలు, మచ్చలు రావు:

కంజీ డ్రింక్‌ను తాగడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు అనేవి రాకుండా ఉండటమే కాకుండా.. త్వరగా తగ్గిపోతాయి. ఈ డ్రింక్‌.. గట్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా జీర్ణ క్రియకు కూడా మద్దతు ఇస్తుంది. మొటిమలు, వాపు వంటి చర్మ సమస్యలకు కారణం అయ్యే టాక్సిన్, వ్యర్థ పదార్థాలను బాడీ నుంచి బయటకు పంపించేస్తుంది.

చర్మాన్ని హైడ్రేటింగ్‌గా ఉంచుతుంది:

కంజీని తరచుగా తాగడం వల్ల చర్మం అనేది హైడ్రేటింగ్‌గా ఉంటుంది. పొడి బారే చర్మం ఉండే వారు ఈ కంజీని తాగితే చర్మానికి మంచి తేమ అంది.. ముఖం నిగారిస్తూ ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!