Life style: మీలో ఈ లక్షణాలున్నాయా.? అయితే మీరు తగినంత నీరు తాగడం లేదని అర్థం

మనిషి బతకడానికి ఆహారం ఎంత ముఖ్యమో.. నీరు కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజు సరిపడ నీరు తాగితే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతుంటారు. మనకు వచ్చే సగం వ్యాధులకు నీరు తాగకపోవడమే కారణమని అంటుంటారు. మరీ ముఖ్యంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే సమ్మర్‌లో...

Life style: మీలో ఈ లక్షణాలున్నాయా.? అయితే మీరు తగినంత నీరు తాగడం లేదని అర్థం
Dehydration
Follow us

|

Updated on: May 26, 2024 | 8:32 AM

మనిషి బతకడానికి ఆహారం ఎంత ముఖ్యమో.. నీరు కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజు సరిపడ నీరు తాగితే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతుంటారు. మనకు వచ్చే సగం వ్యాధులకు నీరు తాగకపోవడమే కారణమని అంటుంటారు. మరీ ముఖ్యంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే సమ్మర్‌లో నీరు తీసుకోకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో తగినంత నీరు లేదనే విషయాన్ని కొన్ని లక్షణాలు మనకు ముందు నుంచే అలర్ట్‌ చేస్తుంటాయి. ఇంతకీ శరీరంలో తగినంత నీరు లేకపోతే కనిపించే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఎలాంటి కారణం లేకుండా దీర్ఘకాలంగా తలనొప్పితో బాధపడుతుంటే శరీరానికి తగినంత నీరు అందడం లేదని అర్థం చేసుకోవాలి. శరీరం డీహ్రైడేషన్‌కు గురైనప్పుడు మెదడులో రక్త ప్రవాహం, ఆక్సిజన్ లభించదు దీంతో తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

* ఇక డీహైడ్రేషన్‌కు గురైన సమయంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. దీంతో మనకు తెలియకుండానే ఎక్కువగా తినేస్తామని నిపుణులు చెబుతున్నారు.

* చాలా కాలంగా నోటి నుంచి దుర్వాసన వస్తుంటే కూడా మీరు తగినంత నీరు తీసుకోవడం లేదని అర్థం చేసుకోవాలి. తక్కువ నీరు తాగడం వల్ల గొంతు పొడి బారుతుంది. దీంతో నోటి లోపల బ్యాక్టీరియా వ్యాపించడం పెరుగుతుంది. దుర్వాసనకు ఇదే ప్రధాన కారణంగా చెప్పొచ్చు.

* శరీరం డీహైడ్రేషనకు గురైన సమయంలో శరీరంలో ప్లాస్మా కౌంట్ కూడా తగ్గుతుంది. రక్త ప్రవాహం పెరుగుతుంది, దీని కారణంగా గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే శరీరంలో నీటి కొరత ఉందని అర్థం చేసుకోవాలి.

* ఇక శరీరంలో సరిపడ నీరు లేకపోవడం వల్ల చర్మం పొడిబారడం ప్రారంభమవుతుంది. చర్మంపై గీతలు, ముడతలు పడడం కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మీరు డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నట్లే అర్థం చేసుకోవాలి.

* ఎంత ఆహారం తీసుకున్నా నీరసంగా ఉంటున్నారంటే మీరు డీహైడ్రేషన్‌ సమస్యతో బాధపడుతున్నారని అర్థం చేసుకోవాలి. అంతేకాదు డీహైడ్రేషన్‌ మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

* తగినంత నీరు తీసుకోకపోతే తీసుకున్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవ్వదు. పేగు కదలికలు సరిగ్గా ఉండకపోవడంతో మల బద్ధకం కూడా వేధిస్తుంది. మలబద్ధకం, అజీర్తి సమస్యలు వేధిస్తుంటే అది డీహైడ్రేషన్‌కు సూచికగా చెప్పొచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..