AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: రోజులో ఎన్ని గ్రీన్‌ టీలు తాగాలో తెలుసా.? నిపుణులు ఏమంటున్నారంటే..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజంతా 2 లేదా 3 కప్పుల గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిది. గ్రీన్ టీని ఈ మొత్తంలో తాగడం వల్ల మనకు దాని ప్రయోజనాలు లభిస్తాయి, ఎలాంటి హాని జరగదు. గ్రీన్ టీలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే అనేక మంచి అంశాలు ఉన్నాయి, కానీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం సైడ్‌ ఎఫెక్ట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.గ్రీన్‌ టీలో కూడా కెఫిన్‌ కంటెంట్‌...

Lifestyle:  రోజులో ఎన్ని గ్రీన్‌ టీలు తాగాలో తెలుసా.? నిపుణులు ఏమంటున్నారంటే..
Green Tea for Women
Narender Vaitla
|

Updated on: Mar 21, 2024 | 7:36 PM

Share

గ్రీన్‌ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బరువు తగ్గడం, శరీరంలోని మలినాలను తొలగించడంలో గ్రీన్‌ టీ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతుంటారు. ప్రతీ రోజూ గ్రీన్‌టీని తీసుకోవాలని చెబుతుంటారు. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని గ్రీన్‌ టీలను ఎక్కువగా తీసుకుంటే మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఒక్క రోజులో ఎన్ని గ్రీన్‌ టీలు తాగొచ్చు.? ఎక్కువగా తాగడం వల్ల జరిగే నష్టం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజంతా 2 లేదా 3 కప్పుల గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిది. గ్రీన్ టీని ఈ మొత్తంలో తాగడం వల్ల మనకు దాని ప్రయోజనాలు లభిస్తాయి, ఎలాంటి హాని జరగదు. గ్రీన్ టీలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే అనేక మంచి అంశాలు ఉన్నాయి, కానీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం సైడ్‌ ఎఫెక్ట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.గ్రీన్‌ టీలో కూడా కెఫిన్‌ కంటెంట్‌ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో మోతాదుకు మించి గ్రీన్‌ టీ తీసుకుంటే శరరంలో కెఫిన్‌ కంటెంట్ పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీంతో నిద్రలేమి, చిరాకు, తలనొప్పి, హృదయ స్పందన రేటు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కునే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే గ్రీన్ టీలో ఐరన్ శోషణను తగ్గించే టానిన్లు ఉంటాయి. దీంతో గ్రీన్‌టీ మోతాదుకు మించి తీసుకుంటే.. ఆహారం తీసుకున్న వెంటనే, మన శరీరం ఆహారం నుండి ఐరన్‌ సరిగా గ్రహించదు. ఇది కాలక్రమేణ రక్త హీనతకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

ఇక గ్రీన్‌ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపునొప్పి, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. దీనికి కారణం గ్రీన్‌ టీ ఎసిడిటీని పెంచుతుంది. కడుపులో చికాకు భావనకు దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో డయేరియాకు కూడా ఇది దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి రోజుకు 2 నుంచి 3 కప్పుల గ్రీన్‌ టీ మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..