- Telugu News Photo Gallery Eating these fruits improves blood circulation in the body, check here is details in Telugu
Blood Circulation: ఈ పండ్లు తింటే రక్త ప్రసరణ మెరుగు పడుతుందట.. మిస్ చేయకండి..
శరీరంలో రక్త ప్రసరణ అనేది చాలా ముఖ్యం. రక్త ప్రసరణ సరిగ్గా జరిగితేనే ఆరోగ్యంగా ఉంటాం. రక్త ప్రసరణకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడితే చాలా ప్రమాదం. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు రావచ్చు. అయితే కొన్ని రకాల పండ్తు తినడం వల్ల శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగు పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సీ ఉండే ఫ్రూట్స్ తినడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుందట. అంతే కాకుండా రక్త నాళాలను బలపరిచేలా..
Updated on: Mar 21, 2024 | 7:10 PM

శరీరంలో రక్త ప్రసరణ అనేది చాలా ముఖ్యం. రక్త ప్రసరణ సరిగ్గా జరిగితేనే ఆరోగ్యంగా ఉంటాం. రక్త ప్రసరణకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడితే చాలా ప్రమాదం. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు రావచ్చు. అయితే కొన్ని రకాల పండ్తు తినడం వల్ల శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగు పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ పండ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

విటమిన్ సీ ఉండే ఫ్రూట్స్ తినడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుందట. అంతే కాకుండా రక్త నాళాలను బలపరిచేలా సహాయం ేస్తాయి. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా ప్రేరేపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

పుచ్చకాయ సీజనల్ ఫ్రూటే అయినా.. ఇది తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా అనేది బాగా మెరుగు పడుతుందట. పుచ్చకాయ శరీరంలో నైట్రిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్త సరఫరా మార్గాన్ని విస్తరింపజేసి.. రక్త నాళాలను రిలాక్స్ చేస్తుంది.

దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి పుష్కలంగా లభ్యమవుతాయి. అలాగే ఇందులో రక్త ప్రసరణను పెంచే పాలిఫెనాల్స్ కూడా ఉంటాయి. ఇవి శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్‌ను పెంచుతాయి.

బ్లూ బెర్రీస్‌లలో ఆంథోసియానైన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభ్యమవుతాయి. ఇవి రక్త నాళాల పని తీరును మెరుగు పరిచి, గుండె సంబంధిత సమస్యలను నివారిస్తాయి. వీటిల్లో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి బ్లడ్ సర్క్యులేషన్‌కు చాలా ముఖ్యం.




