- Telugu News Photo Gallery Why do men tie the thread in waist? These are the reasons, check here is details in Telugu
Spiritual: అసలు మగవాళ్లు మొలతాడు ఎందుకు కట్టుకుంటారు? కారణాలు ఇవే..
జీవితంలో మనం ఎన్నో ఆచారాలు పాటిస్తూ ఉంటారు. అలాగే ఒక మనిషి ఎన్నో కట్టుబాట్లు, నియమాలు కూడా ఉన్నాయి. ఆడవారి నుదుటిన బొట్టు ఉండాలి, చేతికి గాజులు ఉండాలి, శుక్ర వారం, మంగళ వారాలు గోర్లు కట్ చేయకూడదు.. ఇలా చాలా రకాల నియమాలు ఉంటాయి. ఈ క్రమంలోనే మగవారు మొలతాడు అనేది ఖచ్చితంగా కట్టుకోవాలి. ఇలా కట్టుకోవడం అనేది కూడా నియమం. మొలతాడు లేకుండా.. మగ పిల్లలు తిరగకూడదని..
Updated on: Mar 21, 2024 | 7:55 PM

జీవితంలో మనం ఎన్నో ఆచారాలు పాటిస్తూ ఉంటారు. అలాగే ఒక మనిషి ఎన్నో కట్టుబాట్లు, నియమాలు కూడా ఉన్నాయి. ఆడవారి నుదుటిన బొట్టు ఉండాలి, చేతికి గాజులు ఉండాలి, శుక్ర వారం, మంగళ వారాలు గోర్లు కట్ చేయకూడదు.. ఇలా చాలా రకాల నియమాలు ఉంటాయి. ఈ క్రమంలోనే మగవారు మొలతాడు అనేది ఖచ్చితంగా కట్టుకోవాలి.

ఇలా కట్టుకోవడం అనేది కూడా నియమం. మొలతాడు లేకుండా.. మగ పిల్లలు తిరగకూడదని కూడా అంటూ ఉంటారు. ఇందుకు అనేక కారాణాలు ఉన్నాయి. కేవలం శాస్త్రీయ పరంగానే కాదు.. ఆరోగ్య పరంగా కూడా అనేక బెనిఫిట్స్ ఉన్నాయి.

మగవారికి మొలతాడు లేకుండా ఉండటం అంటే.. చనిపోవడం అనే అర్థం వస్తుంది. చనిపోయినప్పుడు మాత్రమే మొలతాడు అనేది తీసేస్తారు. దిష్టి తగలకుండా కూడా మొలతాడును కడతారు.

పూర్వం ఆస్పత్రులు ఉండేవి కాదు. వైద్యం కూడా సరిగ్గా అందేది కాదు. అప్పట్లో పాము కరిస్తే.. మొలతాడు తెంపి.. పాము కుట్టిన చోట దగ్గర కట్టి విషాన్ని తీసేవారని పెద్దలు చెబుతూ ఉంటారు.

అలాగే మొలతాడును కట్టుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది. జీర్ణ క్రియ కూడా మెరుగ్గా పని చేస్తుంది. హెర్నియా వ్యాధి వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. పురుషుల జనేంద్రియాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయనే ఈ మొలతాడును కట్టుకోమంటారు.




