Copper Water: సమ్మర్‌లో రాగి పాత్రలో నీళ్లు తాగితే కలిగే హెల్దీ బెనిఫిట్స్ ఇవే..
రాగి పాత్రలో నీళ్లు తాగితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఎందుకంటే రాగి పాత్రల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అనేవి అధిక మోతాదులో ఉంటాయి. పూర్వం ఎక్కువగా రాగి పాత్రలో వాటర్ తాగేవారు. ఆ తర్వాత ఈ అలవాటు తగ్గినా.. ఇప్పుడు మళ్లీ చాలా మంది రాగి పాత్రల్లో నీటిని తాగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులోనూ వేసవి కాలంలో రాగి పాత్రలోని నీటిని తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులతో..

రాగి పాత్రలో నీళ్లు తాగితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఎందుకంటే రాగి పాత్రల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అనేవి అధిక మోతాదులో ఉంటాయి. పూర్వం ఎక్కువగా రాగి పాత్రలో వాటర్ తాగేవారు. ఆ తర్వాత ఈ అలవాటు తగ్గినా.. ఇప్పుడు మళ్లీ చాలా మంది రాగి పాత్రల్లో నీటిని తాగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులోనూ వేసవి కాలంలో రాగి పాత్రలోని నీటిని తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవారు ఈ నీటిని తాగడం వల్ల మరింత మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే సమ్మర్‌లో రాగి పాత్రలోని నీటిని తాగితే ఆరోగ్య పరంగా చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయి:
సాధారణంగా వేసవిలో ఎండ తీవ్రత కారణంగా అలసట, నీరసంగా అనిపిస్తుంది. బాడీలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. ఇలాంటి సమయంలో రాగి పాత్రలోని నీరు తాగితే చాలా మంచిది. త్వరగా వ్యాధుల బారిన పడకుంటా ఉంటారు. అలాగే వ్యాధులతో పోరాడే శక్తి కూడా లభిస్తుంది.
కీళ్ల నొప్పులు తగ్గుతాయి:
రాగి పాత్రల్లో నీటిని తాగడం వల్ల కీళ్ల వాపులు, నొప్పులు అనేవి రాకుండా ఉంటాయి. అందుకే పూర్వం పెద్దలు ఉక్కు మనుషుల్లా ఉండేవారు. ఇప్పుడు మినరల్ వాటర్ తాగినా.. అనేక సమస్యల బారిన పడుతున్నారు. రాగి పాత్రలో ఉండే ఔషధ గుణాలు.. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది. కాబట్టి ఇందులో నీటిని తాగడం చాలా మంచిది.
గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది:
రాగి పాత్రలోని నీటిని తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. రక్త పోటు కూడా నియంత్రించేందుకు ఈ నీళ్లు సహాయం చేస్తాయి. కాబట్టి ఈ నీటిని తాగడం వల్ల గుండెకు ఎంతో మంచిది.
మెదడు చురుకుగా పని చేస్తుంది:
వేసవిలో రాగి పాత్రల్లోని నీటిని తాగడం వల్ల.. మెదడ పని తీరు మెరుగు పడుతుంది. దీంతో బ్రెయిన్ యాక్టీవ్‌గా పని చేస్తుంది. అంతే కాకుండా.. మెదడుకు రక్త ప్రసరణ కూడా సరిగ్గా జరుగుతుంది. దీంతో జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




