AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: కరివేపాకు నీటితో ఇన్ని లాభాలున్నాయా.? అవేంటో తెలిస్తే..

దాదాపు మనం చేసే ప్రతీ వంటకంలో కరివేపాకును ఉపయోగిస్తుంటాం. వంటకు రుచితో పాటు వాసనను అందించే కరివేపాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే మనలో చాలా మంది కరివేపాకును ఏదో అనవసరమైన దానిలో భావిస్తూ పక్కనపడేస్తుంటారు. అయతే కరివేపాకు తీసుకోవడం ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని

Lifestyle: కరివేపాకు నీటితో ఇన్ని లాభాలున్నాయా.? అవేంటో తెలిస్తే..
Curry Leaves Water
Narender Vaitla
|

Updated on: Apr 20, 2024 | 3:47 PM

Share

దాదాపు మనం చేసే ప్రతీ వంటకంలో కరివేపాకును ఉపయోగిస్తుంటాం. వంటకు రుచితో పాటు వాసనను అందించే కరివేపాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే మనలో చాలా మంది కరివేపాకును ఏదో అనవసరమైన దానిలో భావిస్తూ పక్కనపడేస్తుంటారు. అయతే కరివేపాకు తీసుకోవడం ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కరివేపాకు నీటిని తీసుకోవడం వల్ల మరిన్ని లాభాలు ఉంటాయని మీకు తెలుసా.? ఇంతకీ కరివేపాకును నీటిలో నానబెట్టిన తర్వాత ఆ నీటిని తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* బరువు తగ్గాలనుకునే వారికి కరివేపాకు నీరు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఊబకాయం సమస్య దరిచేరదని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ప్రతీ రోజూ క్రమంతప్పకుండా కరివేపాకు నీటిని తీసుకోవడం వల్ల ఇట్టే బరువు తగ్గొచ్చని చెబుతున్నారు.

* మెరుగైన జీర్ణక్రియకు కూడా కరివేపాకు నీరు ఉపయోగపడుతుంది. ఇందులో లాక్సిటివ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా గ్యాస్, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలకు కరివేపాకు నీరు ఉపయోగపడుతుంది.

* కరివేపాకు నీటిని తాగడం వల్ల శరీరం నుంచి మలినాలు దూరమవుతాయి. కరివేపాకులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే విషపూరిత అంశాలను తొలగిస్తుంది. ఇది చర్మ ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు, ఫ్రీ రాడికల్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

* మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కరివేపాకు నీరు ఉపయోగపడుతుంది. ప్రతీ రోజూ కరివేపాకు నీటిని తీసుకోవడం వల్ల హైపర్‌ టెన్షన్‌ తగ్గిపోతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం