Health: కాఫీలో నెయ్యి.. ఇదేం కాంబినేషన్‌ అనుకుంటున్నారా.?

కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ కాఫీలో నెయ్యిని కలుపుకొని తాగితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా.? కాఫీలో నెయ్యి కలుపుకోవడం ఏంటనేగా మీ సందేహం. అయితే ఇది ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ క్రేజీ కాంబినేషన్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Health: కాఫీలో నెయ్యి.. ఇదేం కాంబినేషన్‌ అనుకుంటున్నారా.?
Health
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 15, 2024 | 9:06 AM

మనలో చాలా మందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీ వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని కూడా పలు అధ్యయనాల్లో వెల్లడైంది. చాలా మందికి కాఫీ తాగనిది రోజే గడవదు. కాస్త సమయం దొరికిందంటే చాలు కాఫీని లాగించేస్తుంటారు. అయితే ఇటీవల కాఫీలో నెయ్యి కలుపుకొని తాగే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కాఫీలో నెయ్యి కలపడం ఏంటని అనుకుంటున్నారా.? అయితే ఇది చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.

కాఫీలో నెయ్యి కలుపుకొని తాగడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ముఖ్యంగా కాఫీలో నెయ్యి కలుపుకొని తీసుకుంటే శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఎన్నో రకాల జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా కాఫీ, నెయ్యి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కడుపుబ్బరం, కడుపులో గ్యాస్‌, మంట వంటి సమస్యలన్నీ తగ్గిపోతాయని చెబుతున్నారు.

ఇక మెదడు ఆరోగ్యానికి కూడా కాఫీ, నెయ్యి మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చని నిపుణులు అంటున్నారు. రెగ్యులర్‌గా ఈ కాంబినేషన్‌ తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దీర్ఘకాలంలో వచ్చే అల్జీమర్స్‌ సమస్యకు చెక్‌పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే కాఫీ, నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఇన్‌స్టాంట్‌ శక్తి లభిస్తుంది. ఇది ఒక్కసారిగా ఎనర్జీ లెవెల్స్‌ని పెంచి, స్టామినా మెరుగవడంలో ఉపయోగపడుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. మెరుగైన జీర్ణక్రియ ద్వారా బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. బీపీ వంటి సమస్యలను కూడా దరిచేరనివ్వకుండా చేస్తుంది. హృదయనాళ ఆరోగ్యానికి కాఫీకి నెయ్యి బాగా పనిచేస్తుంది. ఇక చర్మ ఆరోగ్యాన్ని కూడా కాఫీ, నెయ్యి కాపాడుతుంది. శరీరం హైడ్రేట్‌గా ఉండడంతో పాటు వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. కాఫీలో నెయ్యి తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..