పెరుగు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ప్రతి రోజూ తినడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది అనేక సమస్యల నుంచి కాపాడుతుందంట. కాగా, పెరుగు మన డైట్ లో చేర్చుకోవడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు చూద్దాం.
Updated on: Jul 28, 2025 | 4:31 PM

ఇలా ఖాళీ కడుపుతో పాలు తాగడం, పెరుగు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే ఖాళీ కడుపుతో పాలు, పెరుగు తినకూడదు. ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగడం, పెరుగు తినడం వల్ల ఉబ్బరం, అసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

Curd

ప్రతి రోజూ పెరుగు తినడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్, బిఫిడో బాక్టీరియం వంటివి వైరల్ ఇన్పె క్షన్స్ తో పోరాడే సామార్థ్యాన్ని ఇవ్వడమే కాకుండా జలబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయంట. అలాగే పెరుగులో కార్బో హైడ్రేట్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉండటం వలన ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

ముఖ్యంగా ఉదయం పూట పాలు, పెరుగు తినడం ఆరోగ్యానికి ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయట.

రక్తపోటు సమస్యతో బాధపడే వారికి కూడా ఇది మంచి మెడిసన్ వంటిదంట. పెరుగులో ఎక్కువ మోతాదులో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ మెదడుకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి



