శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం మెదడు. ఈ బ్రెయిన్ ఆరోగ్యంగా పని చేయడం చాలా ముఖ్యం. శరీరం ఆరోగ్యంగా పని చేయాలంటే మెదడు ఆరోగ్యంగా ఉండాలి. లేదంటే బ్రెయిన్‌పై నియంత్రణ ఉండదు. మెదడు ఆరోగ్యంగా పని చేయాలంటే ప్రత్యేకమైన ఆహారాన్ని, పోషకాలను అందించాలి. సరైన పోషకాహారం తీసుకుంటే.. బ్రెయిన్ ఎంత సమర్థవంతంగా పని చేస్తుంది. బ్రెయిన్‌కి సంబంధించిన కణాలు కూడా చక్కగా పనిచేస్తాయి. మెదడు కూడా మొద్దుబారిపోకుండా యాక్టివ్‌గా పనిచేస్తుంది. బ్రెయిన్ యాక్టివ్‌గా పని చేస్తే శరీరం మొత్తం ఆరోగ్యంగా పని చేస్తుంది. కేవలం ఆహారం మాత్రమే కాకుండా మెదడుకు హాని కలిగించే కొన్ని అలవాట్ల కారణంగా కూడా బ్రెయిన్ సరిగా పనిచేయదు. ఫోన్ల వాడకం, బ్లాగ్‌లు, వెబ్ సైట్‌లలో రోజంతా గడపటం వలన కూడా మెదడుపై చెడు ప్రభావం పడుతుంది. మరి మెదడుపై చెడు ప్రభావం చూపించేవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్రలేమి సమస్య కూడా మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. నిద్ర సమస్య ఉంటే మతి మరుపు అనేది తగ్గుతుంది. అందు వల్ల మీకు 8 గంటల నిద్ర అనేది చాలా అవసరం. నిద్ర అనేది శరీరంపై కూడా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అనే హార్మోన్లు కూడా ఇన్ బ్యాలెన్స్ అవుతాయి.
ఏదో సాధారణంగా స్మార్ట్ ఫోన్‌ని వాడుతున్నాం అనుకుంటారు. కానీ ఆ సరదా ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. ఫోన్ వాడకం వలన నిద్రపై ఎఫెక్ట్ పడుతుంది. ఏకాగ్రత కూడా నశిస్తుంది. కాబట్టి ఫోన్ వాడకాన్ని తగ్గించాలి. సోషల్ మీడియా వాడకానికి చాలా దూరంగా ఉండాలి.
ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల కూడా మెదడుపై సైడ్ ఎఫెక్ట్స్ పడతాయి. అధికంగా ఆహారం, చక్కెర అధింగా ఉండే ఫుడ్స్ బ్రెయిన్ పని తీరుపై ప్రతికూలమైన ప్రభావం పడుతుంది.
ఈ మధ్య కాలంలో ఎక్కువగా హెడ్ ఫోన్స్‌ని ఉపయోగిస్తున్నారు. దీని వలన చెవులపైనే కాకుండా ముఖ కండరాలు, మెదడు ఆరోగ్యానికి కూడా హానికరం.
మెదడుకు వ్యాయామం కూడా చాలా అవసరం. ధ్యానం, యోగా ద్వారా కూడా బ్రెయిన్ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. బ్రెయిన్ హెల్దీగా ఉంటేనే శరీరంలో అన్ని భాగాలూ సక్రమంగా పని చేస్తాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..