Heart Attack: ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి.. గుండె జబ్బు కావొచ్చు
మరీ ముఖ్యంగా భారత్‌లో గుండె పోటు సంభవిస్తున్న మరణాలు ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు గుండె సమస్యలతో మరణిస్తున్నారు. అయితే భారతీయుల్లో శారీరక శ్రమలేకపోవడం వల్లే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నట్లు మొన్నటిమొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది...
ఒకప్పుడు కనీసం 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా గుండె సంబంధిత ఇబ్బందులు కనిపించేవి. కానీ ప్రస్తుతం కాలం మారింది. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, శారీరకశ్రమ పూర్తిగా తగ్గిపోవడం, కారణం ఏదైనా.. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.
మరీ ముఖ్యంగా భారత్‌లో గుండె పోటు సంభవిస్తున్న మరణాలు ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు గుండె సమస్యలతో మరణిస్తున్నారు. అయితే భారతీయుల్లో శారీరక శ్రమలేకపోవడం వల్లే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నట్లు మొన్నటిమొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వాకింగ్ పూర్తిగా మానేయడం వల్లే ఇలాంటి సమస్యలు ఎక్కువవుతున్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే గుండె సమస్యలను ముందుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. గుండె పోటు వచ్చే ముందు కొన్ని లక్షణాల ఆధారంగా అంచనా వేసి వెంటనే అలర్ట్ అయితే ప్రాణాలు నిలుపుకోవచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* గుండె పోటు వచ్చే ముందు కనిపించే లక్షణాల్లో శరీరంలో వాపు ఒకటి. ముఖ్యంగా చీలమండలు వంటి శరీరంలోని కొన్ని భాగాలలో వాపు మొదలవుతుంది. ఇది కాలక్రమేణా పెరిగుతూ ఉంటుంది.
* గుండె పనితీరుపై ప్రభావం పడితే వెంటనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. రెండు రోజులకు మించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
* ఇక గుండె కొట్టుకోవడంలో వేగం పెరిగినా వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. గుండెపై భారం పడినప్పుడే ఇలాంటి సందర్భం వస్తుందని హెచ్చరిస్తున్నారు.
* ఒకవేళ ఉన్నపలంగా శరీరం బరువు పెరిగితే వెంటనే అలర్ట్ అవ్వాలి. గుండె సంబధిత పరీక్షల చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
* దీర్ఘకాలంగా గొంతు నొప్పి సమస్యతో బాధపడుతుంటే కూడా అది గుండె వైఫల్యానికి లక్షణంగా నిపుణులు చెబుతున్నారు.
* తక్కువ పనికే ఎక్కువ అలసటగా అనిపిస్తున్నా అది కూడా పనితీరులో వచ్చిన మార్పు లక్షణంగా భావించాలి. వెంటనే సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..