AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleep at Office: ఆఫీస్‌ మీటింగ్స్‌లో నిద్ర వస్తుందా.. ఇలా చేస్తే చిటికెలో నిద్ర ఎగిరిపోతుంది!

నిద్ర అనేది శరీరానికి చాలా అవసరం. ఒక్క రోజు సరిగ్గా నిద్రపోకపోయినా.. దాని ఎఫెక్ట్ చాలా చూపిస్తుంది. సరైన నిద్ర లేకపోతే.. మనిషి మనిషిలోనే ఉండడు. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా ఎక్కువ అవుతాయి. ఒక్కోసారి రాత్రి పూట నిద్ర సరిగ్గా పట్టదు. కానీ ఉదయం ఖచ్చితంగా ఆఫీస్‌కి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఆఫీస్‌లో ఉండగానే మధ్యలో నిద్ర వస్తూ ఉంటుంది. ఒక్కోసారి మీకు మీటింగ్స్ ఉన్నప్పుడు కూడా నిద్ర ముంచుకు వస్తూ ఉంటుంది. కానీ పడుకోవడానికి వీలు..

Sleep at Office: ఆఫీస్‌ మీటింగ్స్‌లో నిద్ర వస్తుందా.. ఇలా చేస్తే చిటికెలో నిద్ర ఎగిరిపోతుంది!
Sleep At Office
Chinni Enni
|

Updated on: Feb 16, 2024 | 12:31 PM

Share

నిద్ర అనేది శరీరానికి చాలా అవసరం. ఒక్క రోజు సరిగ్గా నిద్రపోకపోయినా.. దాని ఎఫెక్ట్ చాలా చూపిస్తుంది. సరైన నిద్ర లేకపోతే.. మనిషి మనిషిలోనే ఉండడు. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా ఎక్కువ అవుతాయి. ఒక్కోసారి రాత్రి పూట నిద్ర సరిగ్గా పట్టదు. కానీ ఉదయం ఖచ్చితంగా ఆఫీస్‌కి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఆఫీస్‌లో ఉండగానే మధ్యలో నిద్ర వస్తూ ఉంటుంది. ఒక్కోసారి మీకు మీటింగ్స్ ఉన్నప్పుడు కూడా నిద్ర ముంచుకు వస్తూ ఉంటుంది. కానీ పడుకోవడానికి వీలు ఉండదు. ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. పని చేస్తున్నప్పుడు నిద్ర పోవడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. మీరు నిద్రపోతున్నట్టు బాస్ చూస్తే.. మిమ్మల్ని మందలించడం ఖాయం. అంతేకాకుండా జాబ్ పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో చాలా ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. మరి ముఖ్యమైన సమయాల్లో నిద్ర రాకుండా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రి పూట నిద్రపోయాల చూసుకోండి:

మీకు ఆఫీస్‌లో ముఖ్యమైన మీటింగ్స్ ఉన్నప్పుడు.. రాత్రి పూట ఖచ్చితంగా నిద్ర పోయేలా చూడండి. నిద్ర కోసం ఓ షెడ్యూల్‌ని ఏర్పాటు చేసుకోండి. నిద్ర పోయే సమయంలో ఫోన్లకు, టీవీలకు దూరంగా ఉండండి. రాత్రి పూట 7 నుంచి 9 గంటలు నిద్రపోతే.. ఉదయం రీఫ్రెష్‌గా ఉండొచ్చు.

యాక్టీవ్‌గా ఉండేలా ట్రై చేయండి:

శారీరక శ్రమ మీ మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా పగటి పూట మగతను దూరం చేస్తుంది. ఉదయం లేదా భోజన విరామ సమయంలో వాకింగ్ లేదా చిన్న పాటి వ్యాయామాలు చేయడం వల్ల నిద్రను దూరం చేసుకోవచ్చు. చిన్నపాటి ఎక్సర్ సైజులు చేయడం వల్ల.. శరీరంలో రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. మీ మెదడు రక్త ప్రసరణకు సరిపడా ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. దీంతో మీరు రోజంతా యాక్టీవ్‌గా ఉండొచ్చు.

ఇవి కూడా చదవండి

పని చేసే ప్రదేశం సౌకర్యవంతంగా ఉండాలి:

మీరు పని చేసే ప్రదేశం ముందు మీకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేసుకోండి. చుట్టూ మీకు నచ్చిన వస్తువులను లేదా మొక్కలను ఉంచుకోవాలి. అంతే కాకుండా తగిన సూర్య కాంతి ప్రసరించేలా చూడండి. దీని వల్ల మీరు పరధ్యానానికి గురి కాకుండా ఉంటారు. నిద్ర మగత ఎగిరిపోతుంది. అప్పుడప్పుడు కళ్లను నీటితో కడుక్కోవడం చేస్తూ ఉండండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!