AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: ఎలక్ట్రిక్‌ మసాజర్లతో నష్టాలు ఉంటాయా.? నిపుణులు ఏమంటున్నారంటే..

వీటితో ఎవరి సహాయం లేకుండా ఒంటి చేత్తో మసాజ్‌ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్‌ మసాజర్స్‌లో ఎన్నో రకాలు ఉన్నాయి. వీటిలో హ్యాండ్ ఎలక్ట్రిక్‌ మసాజర్‌ ఒకటి. దీని సహాయంతో చేత్తోనే సింపుల్‌గా ఆపరేట్ చేసుకోవాలి. శరీరంలోని ఏ భాగంలో నొప్పిగా ఉంటుందో అక్కడ మసాజర్‌ను పెడితే చాలు వెంటనే నొప్పి తగ్గుతుంది. ఇక ఎలక్ట్రిక్‌ బడీ మసాజర్‌ సహాయంతో శరీరం మొత్తం మసాజ్‌ చేసుకోవచ్చు..

Lifestyle: ఎలక్ట్రిక్‌ మసాజర్లతో నష్టాలు ఉంటాయా.? నిపుణులు ఏమంటున్నారంటే..
Electric Massagers
Narender Vaitla
|

Updated on: Aug 01, 2024 | 9:54 AM

Share

మారుతోన్న జీవన విధానం, పని ఒత్తిడి కారణంగా ఇటీవల చాలా మంది అలసట, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. ఒకప్పుడు ఎంత శారీరక శ్రమ చేసినా పెద్దగా నొప్పులు ఉండేవి కావు. కానీ ప్రస్తుతం ఒళ్లు నలగకుండా కంప్యూటర్‌ ముందు కూర్చొని పని చేస్తున్నా ఒంటి నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో చాలా మంది ఒంటి నొప్పులు తగ్గించుకునేందుకు మసాజ్‌లు చేయించుకుంటున్నారు. అయితే ఇందుకోసం కొందరు పార్లర్ల చుట్టూ తిరుగుతుంటే మరికొందరు మాత్రం ఇంట్లోనే మసాజ్‌ చేసుకోవడానికి వీలుగా ఎలక్ట్రిక్‌ మసాజర్లను కొనుగోలు చేసుకుంటున్నారు.

వీటితో ఎవరి సహాయం లేకుండా ఒంటి చేత్తో మసాజ్‌ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్‌ మసాజర్స్‌లో ఎన్నో రకాలు ఉన్నాయి. వీటిలో హ్యాండ్ ఎలక్ట్రిక్‌ మసాజర్‌ ఒకటి. దీని సహాయంతో చేత్తోనే సింపుల్‌గా ఆపరేట్ చేసుకోవాలి. శరీరంలోని ఏ భాగంలో నొప్పిగా ఉంటుందో అక్కడ మసాజర్‌ను పెడితే చాలు వెంటనే నొప్పి తగ్గుతుంది. ఇక ఎలక్ట్రిక్‌ బడీ మసాజర్‌ సహాయంతో శరీరం మొత్తం మసాజ్‌ చేసుకోవచ్చు. ఈ మసాజర్‌లు కుర్చీలు, ప్యాడ్‌ల వంటి రూపంలో అందుబాటులో ఉన్నాయి. బిగుతుగా ఉండే కండరాలను వదులు చేయడంలో సహాయపడే హీట్ గ్యాడ్జెట్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ మసాజర్లతో చాలా రిలీఫ్‌ లభిస్తుందని తెలిసిందే. అయితే వీటివల్ల ఏవైనా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయా.? అసలు మసాజర్లతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎలక్ట్రిక్‌ మసాజర్ల వల్ల నిజానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. వీటి ద్వారా త్వరగా నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. అలాగే ఒత్తిడిని దూరం చేసుకోవాలి. శరీరంలోని అన్ని అవవయవాలకు రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా ఇది ఉపయోగపడుతుంది. ఇది కండరాల ఒత్తిడిని దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

అయితే ఎలక్ట్రిక్‌ మసాజర్లతో ఉపయోగాలు ఉన్నాయన్నదాంట్లో ఎంత నిజం ఉందో. నష్టాలు కూడా ఉన్నాయి. ఎలక్ట్రిక్‌ మసాజర్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల శరీరం వాటిని అలవాటు పడే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఒకవేళ వీటిని సరిగ్గా ఉపయోగించుకోకపోతే కండరాల నొప్పి, చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిని ఉపయోగించే ముందు వైద్యుల సూచనలు పాటించడం ఎంతో ఉత్తమం. కండరాల నొప్పులు ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్