Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: చెవులు వినిపించకపోవడానికి ఇన్ని కారణాలున్నాయా.? అవేంటంటే..

చెవులు వినిపించకపోవడం సాధారణంగా వయసు మళ్లిన వారిలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా 70 ఏళ్లు పైబడిన వారిలో తరచుగా ఈ సస్య కనిపిస్తుంది. అయితే కొన్ని సార్లు తక్కువ వయసున్న వారిలో కూడా ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ మధ్య కాలంలో 50 ఏళ్లు కూడా నిండని వారిలో చెవులు వినిపించకపోవడం ఒక సమస్యగా మారుతోంది...

Health: చెవులు వినిపించకపోవడానికి ఇన్ని కారణాలున్నాయా.? అవేంటంటే..
Hearing Loss
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 09, 2024 | 8:27 AM

చెవులు వినిపించకపోవడం సాధారణంగా వయసు మళ్లిన వారిలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా 70 ఏళ్లు పైబడిన వారిలో తరచుగా ఈ సస్య కనిపిస్తుంది. అయితే కొన్ని సార్లు తక్కువ వయసున్న వారిలో కూడా ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ మధ్య కాలంలో 50 ఏళ్లు కూడా నిండని వారిలో చెవులు వినిపించకపోవడం ఒక సమస్యగా మారుతోంది.

వినికిడి శక్తి తగ్గడానికి వయసు పెరగడం ఒక్కటే కారణం కాదని, మరెన్నో కారణాలు కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ బారిన పడిన వారిలో కూడా ఈ సమస్య కనిపించినట్లు నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ ప్రారంభ దశలో అల్కా యాగ్నిక్‌ వైరస్‌ బారినపడిన వారిలో చెవుడు సమస్య కనిపించందని చెబుతున్నారు. కరోనా సమయంలో వాసన గుణం కోల్పోయినట్లే కొందరిలో వినికిడి శక్తి కూడా తగ్గినట్లు తేలింది. ఇక వినికిడి శక్తి తగ్గడానికి మరికొన్ని కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* పెరుగుతున్న వయసు కారణంగా వినికిడి శక్తి తగ్గుతుంది. దీనిని ప్రెస్బికసిస్‌గా పిలుస్తారు. పెరుగుతున్న వయస్సు కారణంగా, మెదడు ప్రక్రియలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది వినికిడి శక్తి తగ్గడానికి కారణమవుతుంది.

* కొన్ని సందర్భాల్లో తలకు గాయం కావడం వల్ల కూడా అకస్మాత్తుగా వినికిడి లోపం వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చెవి కణాలపై ఒత్తిడి పడడం వల్ల వినికిడి సమస్యపెరుగుతుంది. దీనిని సెన్సోరినిరల్‌గా చెబుతుంటారు.

* డయాబెటిస్‌తో బాధపడేవారికి కూడా వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మధుమేహంతో బాధపడేవారిలో చెవి రక్త ప్రసరణను బాగా ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా సెన్సోరినిరల్ వినికిడి లోపం సమస్య ఏర్పడుతుంది.

* హైబీపీ ఉన్న వారికి చెవులు సరిగా వినిపించవని నిపుణులు చెబుతున్నారు. అధిక బీపీ వల్ల చెవుల్లోని రక్త నాళాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీనివల్ల వినికిడి శక్తి తగ్గుతుంది.

* చెవి ఇన్ఫెక్షన్లు గవదబిళ్లలు, మీజిల్స్, రుబెల్లా, సైటోమెగలోవైరస్ (CMV), హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ వల్ల కూడా వినికిడి శక్తిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీని కారణంగా సెన్సోరినిరల్ వినికిడి లోపం సమస్య ఏర్పడుతుంది.

* ఇక ‘సెన్సోరినరల్ వినికిడి నష్టం’కి ఎక్కువ సేపు హెడ్‌ఫోన్స్‌ను, ఇయర్‌ ఫోన్స్‌ను ఉపయోగించడం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..