వేయించిన శనగలతో వెయ్యి లాభాలు.. 

Narender Vaitla

21 October 2024

వేయించిన శనగల్లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. అజీర్తిని దూరం చేయడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడంలో కూడా శనగలు బాగా సహాయడుతాయి. ముఖ్యంగా ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ త్వరగా కడుపు నింపిన భావన కలిగిస్తుంది. దీంతో బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

వేయించిన శనగల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను, దంతాల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. ఆస్టియోపోరోసిస్‌ ముప్పు తగ్గుతుంది.

 ఇక గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా వేయించిన శనగలు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని రాగి, ఫాస్పరస్ గుండె సమస్యల ముప్పును తగ్గిస్తాయి.

డయాబెటిస్‌ సమస్యతో బాధపడేవారికి కూడా వేయించిన శనగలు ఉపయోగపడతాయి. ఇందులో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలలో ఆకస్మిక హెచ్చుతగ్గుల ముప్పును తగ్గిస్తుంది.

శనగల్లో ఉండే విటమిన్‌ బీ9, ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడుకు మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. చిన్నారులకు ఇవి ఇవ్వడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

కాలేయ ఆరోగ్యానికి రక్షించడంలో కూడా శనగలు బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి కాలేయంలోని కొవ్వు జీర్ణమవ్వటంలో సాయపడి కాలేయం బాగా పనిచేసేలా చేస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.