ఇలా క్లీన్‌ చేస్తే మీ బాత్రూమ్ టైల్స్ దగదగా మెరుస్తాయ్‌

21 October 2024

TV9 Telugu

TV9 Telugu

బాత్రూమ్ శుభ్రంగా లేకపోతే ఇళ్లంతా మురికిగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీంతో బాత్‌రూమ్‌కి వెళ్లడం భారంగా అనిపిస్తుంది. చాలా ప్రదేశాలలో నీటిలో ఇనుము అధికంగా ఉండటం వల్ల బాత్రూం టైల్స్‌పై పసుపు మరకలు సులభంగా పేరుకుపోతున్నాయి

TV9 Telugu

పసుపు మచ్చల మరకలన్నీ తొలగించేందుకు మార్కెట్‌లో రకరకాల లిక్విడ్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ.. వంటగదిలోని వస్తువులతో కేవలం 1 నిమిషంలో బాత్రూమ్‌ను సులభంగా మెరిసేలా చేయవచ్చు 

TV9 Telugu

ముందుగా అర బకెట్ వేడి నీటిని తీసుకోవాలి. అందులో అరకప్పు బేకింగ్ సోడా, అరకప్పు నిమ్మరసం కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని టైల్స్‌పై స్ప్రే చేసి టైల్స్‌ను బాగా రుద్దాలి. ఆ తర్వాత 5 నిమిషాలు అలాగే ఉంచి నీటితో కడిగేస్తే టైల్స్ మెరుస్తాయి

TV9 Telugu

వెనిగర్ కూడా మరకలను తొలగించడంలో బలేగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో అరకప్పు నీరు, అరకప్పు వైట్ వెనిగర్ కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో గుడ్డ లేదా స్పాంజిని ముంచి దానితో టైల్స్ ను రుద్దాలి

TV9 Telugu

అనంతరం కాసేపు ఆలాగే ఉంచి, ఆ తర్వాత నీటితో కడిగితే టైల్స్‌ కొత్తవిగా కనిపిస్తాయి. మొండి మరకలను తొలగించడంలో బ్లీచ్‌కు మించిన రెమెడీ మరొకటి లేదు

TV9 Telugu

మురికిగా ఉన్న బాత్రూమ్ టైల్స్ శుభ్రం చేయడానికి బ్లీచ్ ఉపయోగించవచ్చు. 3:1 నిష్పత్తిలో నీరు, బ్లీచ్ కలుపుకోవాలి. ఇప్పుడు, దీనిని స్ప్రే బాటిల్‌లో తీసుకుని, బాత్రూమ్ టైల్స్‌పై స్ప్రే చేసి, ఒక గుడ్డతో తుడిచేస్తే పాత టైల్స్ కొత్త టైల్స్ లాగా మెరుస్తాయి

TV9 Telugu

వాష్‌ రూం వాడిన ప్రతిసారీ ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ వేయడం మర్చిపోరు. లోపలి గాలి బయటకు వెళ్లడం వల్ల తాజాదనం అనుభూతికి వస్తుంది

TV9 Telugu

కాబట్టి ఖరీదైన లిక్విడ్‌లను కొనడానికి బదులు, మీ వంటగదిలోని పదార్థాలపై ఆధారపడవచ్చు. ఈ చిట్కాలు పాటిస్తే కొద్ది నిమిషాల్లో మీ బాత్రూమ్ మెరిసిపోతుంది. ఇకేం మీరూ ట్రై చేస్తారుకదూ..