AP TET 2024 Result Date: ఏపీ టెట్‌ పరీక్షలకు భారీగా తగ్గిన హాజరు.. ఫలితాలు ఎప్పుడంటే!

ఏపీ టెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 17 రోజులపాటు జరిగిన ఈ పరీక్షలకు అభ్యర్ధులు

AP TET 2024 Result Date: ఏపీ టెట్‌ పరీక్షలకు భారీగా తగ్గిన హాజరు.. ఫలితాలు ఎప్పుడంటే!
AP TET 2024 Result Date
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 22, 2024 | 1:48 PM

అమరావతి, అక్టోబర్‌ 22: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) జులై పరీక్షలు అక్టోబరు 21తో ముగిశాయి. 17 రోజల పాటు రెండు విడతలుగా నిర్వహించిన ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌ పరీక్షకు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేయగా.. వారిలో 3,68,661 అంటే 86.28 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్‌ పరీక్షలకు హాజరయ్యారు. సోమవారం జరిగిన చివరి పరీక్ష పేపర్‌ 2ఏ సోషల్ స్టడీస్‌, పేపర్‌ 2బీ ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షల రెస్పాన్స్‌ షీట్లు, ప్రాథమిక ఆన్సర్‌ కీలను అక్టోబరు 23 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వీటిపై అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో అక్టోబరు 25 వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. మొత్తం 17 రోజుల పాటు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, రాష్ట్ర, జిలా స్థాయి అధికారులు, విద్యుత్, రవాణా, వైద్య, పొలీసు విభాగాల అధికారులు, సాంకేతిక నిపుణుల బృందం సమన్వయంతో పనిచేసి టెట్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించారని కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.

ఇక చివరి రోజు పరీక్షలకు మొత్తం 11,877 మందికి గాను 9,844 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అంటే మొత్తం మందిలో 82.88 శాతం మంది హాజరయ్యారన్నమాట. ఉదయం 38 సెంటర్లలో జరిగిన పేపర్ 2ఏ సోషల్‌ స్టడీస్‌ పరీక్షకు 9,441 మందికి గాను 7,886 మంది అంటే 83.53 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 17 సెంటర్లలో జరిగిన పేపర్ 2బి ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు 2,436 మందికి గాను 1958 మంది అంటే 80.38 శాతం మంది హాజరయ్యారు

కాగా ఏపీలో 16,347 ఉపాధ్యాయ పోస్టులకు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని కూటమి సర్కార్‌ ఏర్పాటైన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేయడంతో లక్షలాదిమంది నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. డీఎస్సీలో వీలైనంత ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకు మరోసారి టెట్‌ పరీక్షను కూడా నిర్వహించాలని నాడే ప్రకటించారు. ఈ మేరకు టెట్‌ పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారు. ఏపీ టెట్‌ ఫలితాలు నవంబర్ 2వ తేదీన విడుదలవనున్నాయి. మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ నవంబర్ మొదటి వారంలో విడుదల కానుంది. నవంబరు 3న విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమాయాత్తమవుతుంది. మెగా డీఎస్సీ మొత్తం పోస్టుల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371, స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ) 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీలు) 1781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీలు) 286, ప్రిన్సిపల్స్‌ 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు) 132 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు