AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lemon: నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? తెలిస్తే అవాక్కే..

నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎన్నో సమస్యలను నిమ్మకాయ నివారిస్తుంది. నిమ్మకాయ కేవలం రుచి, అందం కోసమే మాత్రమే కాదు.. ఇతర ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి. నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? ఆ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Lemon: నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? తెలిస్తే అవాక్కే..
Lemon Slice In The Fridge
Krishna S
|

Updated on: Aug 22, 2025 | 10:22 PM

Share

నిమ్మకాయంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందం నుంచి ఆరోగ్యం వరకు దీనిని వివిధ రూపాలలో ఉపయోగిస్తారు. నాన్ వెజ్ ఉందంటే నిమ్మకాయ ఉండాల్సిందే. నిమ్మకాయ కేవలం ఆహార పదార్థాలలో రుచిని పెంచడానికి మాత్రమే కాదు.. ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నిమ్మకాయను కోసి ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలోని యాంటీ బాక్టీరియల్, సిట్రిక్ యాసిడ్ లక్షణాలు ఫ్రిజ్‌ను శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఫ్రిజ్ దుర్వాసన తొలగిస్తుంది

ఫ్రిజ్‌ను ఎంత శుభ్రంగా ఉంచినా కొన్నిసార్లు అందులో దుర్వాసన రావడం సాధారణం. ఇలాంటి సందర్భాలలో ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేసి రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే ఆ దుర్వాసన తొలగిపోతుంది. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ చెడు వాసనను పీల్చుకుని, ఫ్రిజ్‌లో తాజా సువాసన ఉండేలా చేస్తుంది.

ఆహారం ఎక్కువ కాలం తాజాగా..

ఫ్రిజ్‌లో ఉంచిన కొన్ని ఆహార పదార్థాలు త్వరగా చెడిపోతుంటాయి. ఈ సమస్యను నివారించడానికి నిమ్మకాయ ముక్కలను ఉపయోగించవచ్చు. నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆహార పదార్థాలు త్వరగా చెడిపోకుండా కాపాడతాయి. అయితే ఈ ప్రయోజనం కోసం ఎప్పుడూ తాజా, శుభ్రమైన నిమ్మకాయ ముక్కలను మాత్రమే ఉపయోగించడం మంచిది.

గాలిని సహజంగా శుద్ధి చేస్తుంది

నిమ్మకాయ ముక్కలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల కలిగే మరో ప్రయోజనం, ఇది ఫ్రిజ్‌లోని గాలిని సహజంగా శుద్ధి చేస్తుంది. నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, సిట్రిక్ యాసిడ్ ఫ్రిజ్‌లోని గాలిని తాజాగా ఉంచుతాయి. దీనివల్ల ఫ్రిజ్‌లో ఉండే బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్