AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg Storage: ఫ్రిజ్‌లో గుడ్లను నిల్వ చేయడానికి అత్యంత సురక్షితమైన ప్రదేశం ఏదో తెలుసా?

గుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడుతారు. కొందరు కొసారి బల్క్‌లో ఎగ్స్ తెచ్చి ఇంట్లో ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకొని వాడుతారు. అయితే ప్రిజ్‌లో పెట్టినప్పుటికీ కొన్ని సార్లు గుడ్లు చెడిపోతూ ఉంటాయి. వాటిని ప్రిజ్‌లో సరిగ్గా నిల్వ చేయకపోవడమే కారణం. కాబట్టి గుడ్లు ఫ్రెష్‌గా ఉండాలంటే ప్రిజ్‌లో ఏ ప్లేస్‌టో పెట్టాలో తెలుసుకుందాం పదండి.

Egg Storage: ఫ్రిజ్‌లో గుడ్లను నిల్వ చేయడానికి అత్యంత సురక్షితమైన ప్రదేశం ఏదో తెలుసా?
Best Place To Keep Eggs In
Anand T
|

Updated on: Jun 01, 2026 | 3:41 PM

Share

గుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సూపర్ ఫుడ్‌. ఇవి తక్కవు ఖర్చుతో ఎక్కవు పోషకాలు అందించే ఆహారం. అందుకే చాలా మంది వీటిని తినేందుకు ఇష్టపడుతారు. డాక్టర్స్ కూడా వీటిని తినమని రిఫర్ చేస్తుంటారు. అయితే మళ్లీ మళ్లీ మార్కెట్‌కు ఎవరు వెళ్తారని చాలా మంది వీటిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి ఫ్రిజ్‌లో పెట్టి వాడుతూ ఉంటారు. అయితే, గుడ్లను కేవలం ఫ్రిజ్‌లో ఉంచడమే కాదు. వాటిలో ప్రిజ్‌లో ఎక్కడ పెడుతున్నామనేది కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. లేదంటే ఉష్ణోగ్రత హెచ్చతగ్గుల కారణంగా అవి చెడిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కాబట్టి ప్రిజ్‌లో గుడ్లను ఎక్కడ పెట్టడం సురక్షితమో చూద్దాం.

ఫ్రిజ్‌లో గుడ్లను ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదో తెలుసుకోండి

ఫ్రిజ్ డోర్‌లో గుడ్లను ఉంచకూడదు: చాలా మంది గుడ్లను ప్రిజ్‌ డోర్‌కు ఉంటే ట్రేలో ఉంచుతారు. అయితే ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రిజ్‌ డోర్ తెలిచినప్పుడల్లా బయటి నుండి వచ్చే వేడి గాలి మొదట తలుపుకు తగిలిన వస్తువులను తాకుతుంది. ఇది మీరు మీరు ప్రిజ్‌ డోర్‌లో గుడ్లను నిల్వ చేసిన గుడ్ల పై పెంకుపై తేమను సృష్టిస్తుంది. ఈ తేమ గుడ్ల లోపల బ్యాక్టీరియా వేగంగా పెరగడానికి కారణమవుతుంది, దీనివల్ల అవి తినడానికి పనికిరాకుండా పోతాయి. కాబట్టి ప్రిజ్‌ డోర్స్‌లో ఎప్పుడు ఎగ్స్‌ను పెట్టకండి

అతిపెద్ద ప్రమాదం – సాల్మొనెల్లా: ఈ ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల కారణంగా సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. దీని వల్ల గుడ్లు త్వరగా పాడయిపోవడం జరుగుతుంది. ఇలా పాడైపోయిన లేదా కలుషితమైన గుడ్లను తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి తీవ్రమైన అనారోగ్యాలు రావచ్చు. అందుకే ఆహార నిపుణులు గుడ్లను రిఫ్రిజిరేటర్ డోర్‌లో నిల్వ చేయవద్దని సలహా ఇస్తారు.

గుడ్లను నిల్వ చేయడానికి సరైన స్థలం ఏది?

గుడ్లు ఎక్కువ కాలం తాజాగా, సురక్షితంగా ఉండాలంటే వాటిని ప్రిజ్‌లో ఎక్కడ నిల్వ చేస్తున్నామనేది చాలా ముఖ్యం.

లోపలి అరల్లో ఉంచండి: గుడ్లను ఫ్రిజ్ డోర్‌లో కాకుండా, లోపలి భాగంలో ఉండే మధ్య లేదా కింది అరల్లో ఉంచాలి. ఇక్కడ ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా, చల్లగా ఉంటుంది. కాబట్టి గుడ్లు చెడిపోకుండా ఫ్రెష్‌గా ఉంటాయి.

కార్టన్ బాక్స్‌లోనే ఉంచండి: చాలా మంది గుడ్లను ట్రే నుంచి తీసి ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అలా కాకుండా నేరుగా ట్రేతోనే గుడ్లను ప్రిజ్‌లోనే ఉంచండి. దీనివల్ల ఫ్రిజ్‌లోని ఇతర ఆహార పదార్థాల వాసనలు గుడ్లకు అంటకుండా ఉంటాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us