AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tandoori Tea: ఇక కేఫ్‌తో పని లేదు.. ఇంట్లోనే సూపర్‌ టేస్టి తందూరి ఛాయ్.. ఎలా తయారు చేసుకోవాలంటే!

టీ.. ఇది లేనిదే ఎవరికీ రోజు గడవదు.. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు రోజూకు ఒక్కసారైనా దీన్ని తాగాల్సిందే. ప్రస్తతం మార్కెట్‌లో అల్లం టీ, మసాలా టీ ఇలా అనేక రకాల టీలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తందూరి టీ అనేది బాగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీన్ని తాగేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. అయితే ఈటీని ఇంట్లోనే టేస్టీగా మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Tandoori Tea: ఇక కేఫ్‌తో పని లేదు.. ఇంట్లోనే సూపర్‌ టేస్టి తందూరి ఛాయ్.. ఎలా తయారు చేసుకోవాలంటే!
Tandoori Tea
Anand T
|

Updated on: Nov 19, 2025 | 9:18 PM

Share

భారతదేశంలో టీ ప్రియులకు కొరత లేదు. సీజన్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు దీన్ని ఇష్టపడుతారు. ఇక వర్షాకాలం, శీతాకాలంలో వస్తే ప్రతి ఒక్కరికి వేడి వేడి పొగలు కక్కే టీ కావాల్సిందే.. ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల టీలు అందుబాటులో ఉన్నాయ్.. అలాంటి ఒకటే ఈ తందూరి టీ కూడా. ఇది కొద్దిగా కాస్ట్లీగా ఉన్న సూపర్ టేస్ట్ ఉంది. ఒక ఫ్యామిలీ మొత్తం కేఫ్‌కు వెళ్లి టీ తాగాలంటే కష్టం. కాబట్టి దుఖానానికి వెళ్ల కుండా ఇంట్లోనే మట్టి వాసనతో మైమరిపించే తందూరి టీ ఎలా తయారు చేసుకోవాలి ఇక్కడ తెలుసుకోండి.

తందూరీ టీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు

  • పాలు – 1 కప్పు
  • నీరు – 1 కప్పు
  • టీ పొడి – 2 టీస్పూన్లు
  • యాలకులు – 3
  • అల్లం – చిన్న ముక్క
  • చిన్న మట్టి కుండ – 1
  • టీ ఇన్ఫ్యూజర్
  • చక్కెర – అవసరమైన విధంగా

ఇంట్లోనే తందూరి టీ ఎలా తయారు చేసుకోవాలి..?

  • ముందుగా ఒక పాత్రలో నీళ్ళు పోసి మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత టీ పొడి, అల్లం, ఏలకులు వేయాలి. కావాలనుకుంటే లవంగాలు కూడా వేయవచ్చు. ఈ పదార్థాలన్నీ వేసి మరిగించాలి.
  • టీ పొడి గోధుమ రంగులోకి మారడం ప్రారంభించి, నీరు రంగు మారడం ప్రారంభించినప్పుడు, పాలు చక్కెర వేసి మరిగే వరకు వేచి ఉండండి.
  • ఇప్పుడు, మరొక స్టవ్‌ను వెలిగించి, దానిపై నేరుగా ఒక మట్టి కుండ లేదా ఒక చిన్న మట్టి కుండను వేడి చేయండి. కుండ కొద్దిగా నల్లగా మారిన తర్వాత  వేడి కుండను వెండి గిన్నెలో ఉంచండి.
  • తరువాత, నెమ్మదిగా, టీని అందులో పోయాలి. మీరు ఈ టీని కుండలో పోసినప్పుడు, దాని నుండి పొగ వస్తుంది. అంతే, మీ రుచికరమైన తందూరి టీ రెడీ అయిన్టే . మీరు రుచిని పెంచాలనుకుంటే, మీకు నచ్చితే కొంచెం దాల్చిన చెక్క లేదా ఏలకులు కూడా యాడ్ చేసుకోవచ్చు.

తందూరి టీ తయారుచేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు

  • బంకమట్టితో తయారు చేసిన గ్లాస్‌లో టీ తాగడం వల్ల జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా, గ్యాస్ అసిడిటీ నుండి ఉపశమనం కలుగుతుంది.
  • టీ తయారుచేసేటప్పుడు పెయింట్ చేసిన లేదా మెరుస్తున్న మట్టి కుండలను ఉపయోగించవద్దు, ఎందుకంటే ఇవి హానికరం.
  • మట్టి కుండను ఓవెన్‌లో ఉంచి వేడి చేసినప్పుడు అది దాదాపు నల్లగా మారే వరకు వేడి చేయండి.
  • టీ తయారుచేసేటప్పుడు, మీరు పుదీనా, చాక్లెట్ లేదా జెల్లో టీని ప్రయత్నించవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.