Patika Bellam: పటిక బెల్లమే అని తీసిపారేస్తున్నారా.. దీనితో ఈ లాభాలు మీరు ఊహించలేనివి..

పటిక బెల్లం తీసుకొవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇవి శరీరాన్ని బలంగా, దృఢంగా ఉంచుతాయి. ఆయుర్వేదంలో కూడా పటిక బెల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.

Patika Bellam: పటిక బెల్లమే అని తీసిపారేస్తున్నారా.. దీనితో ఈ లాభాలు మీరు ఊహించలేనివి..
Patika Bellam
Follow us

|

Updated on: Oct 29, 2024 | 4:13 PM

పటిక బెల్లం అంటే ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియక పోవచ్చు. ప్రస్తుత కాలంలో ఎక్కువగా పంచదారను ఉపయోగిస్తున్నారు. కానీ పూర్వం మాత్రం ఎక్కువగా పటిక బెల్లాన్నే ఉపయోగించేవారు. ఇప్పటికీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే.. వారికి పటిక బెల్లాన్నే ఇస్తారు. పటిక బెల్లమే కదా అని తీసి పారేయకండి. వీటితో ఉండే లాభాలు నిజంగానే మీరు ఊహించలేరు. కేవలం తీపిదనం కోసమే కలుపుతున్నామంటే పొరపాటే. పటిక బెల్లం తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా పటిక బెల్లాన్ని వివిధ రకాల సమస్యలను తగ్గించడంలో ఉపయోగిస్తున్నారు. పటిక బెల్లంలో కూడా అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. పంచదారకు బదులు పటిక బెల్లం పొడి వాడే హెల్త్‌కి చాలా మంచిది. మరి పటిక బెల్లం తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

పటిక బెల్లం తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల త్వరగా సీజనల్ వ్యాధులు ఎటాక్ చేయకుండా ఉంటాయి. వ్యాధులతో పోరాడే శక్తి కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఈ పటిక బెల్లం పొడి పిల్లలకు ఇస్తే చాలా మంచిది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

జలుబు, దగ్గు కంట్రోల్:

ప్రస్తుతం ఇప్పుడు చలికాలం ప్రారంభమైంది. ఈ సమయంలో ఎక్కువగా జలుబు, దగ్గు ఎటాక్ చేస్తూ ఉంటాయి. వీటి నుంచి త్వరగా కోలుకోవాలి అన్నా.. జలుబు, దగ్గు రాకుండా ఉండాలన్నా పటిక బెల్లాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.

ఇవి కూడా చదవండి

తక్షణమే శక్తి:

పటిక బెల్లం తీసుకోవడం వల్ల తక్షణమే శక్తి అందుతుంది. త్వరగా అలసట, నీరసించి పోయేవారు ఈ పటిక బెల్లం తీసుకోవడం మంచిది. దీని వల్ల వీరికి తక్షణమే శక్తిని పొందవచ్చు.

రక్త హీనత కంట్రోల్:

పటిక బెల్లంలో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రక్త హీనత సమస్యతో బాధ పడేవారికి, చిన్న పిల్లలకు ఎక్కువగా పటిక బెల్లం ఇస్తే చాలా మంచిది. మహిళలు తీసుకోవడం వల్ల పీరియడ్స్‌లో వచ్చే సమస్యలు తగ్గుతాయి.

ఎముకలు బలంగా ఉంటాయి:

పటిక బెల్లం ద్వారా క్యాల్షియం కూడా లభిస్తుంది. ఇది ఎముకలు, దంతాలను బలంగా ఉండేలా చేస్తుంది. ఎక్కువగా కీళ్ల నొప్పులు, నడుము నొప్పిలుతో బాధ పడేవారు ఈ పటిక బెల్లం తీసుకుంటే మంచిది.

చర్మం సౌందర్యం:

పటిక బెల్లం తీసుకోవడం వల్ల చర్మానికి కూడా చాలా మేలు జరుగుతుంది. పటిక బెల్లాన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే చర్మం ఎంతో అందంగా తయారవుతుంది. చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు పోయి.. చర్మం హైడ్రేట్‌గా కాంతివంతంగా తయారవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.