Summer Cool Drink: ఆరోగ్యానికి అమృతం మజ్జిగ.. వేసవి నుంచి ఉపశమనం కోసం ఎలా తీసుకోవాలంటే..

ఉష్ణోగ్రత కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దీనిని భర్తీ చేసుకోవడానికి మజ్జిగను తరచుగా తీసుకోవాలి. వేసవి తాపం ఉశమనం తో పారు ఆరోగ్యానికి అమృతం వంటిది మజ్జిగ. పెరుగు కంటే వేసవి లో మజ్జిగను తరచుగా తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా శీతల పానీయాల కంటే మజ్జిగ ఎన్నో లాభాలున్నాయి. అయితే ఈ రోజు మజ్జిగను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.. 

Summer Cool Drink: ఆరోగ్యానికి అమృతం మజ్జిగ.. వేసవి నుంచి ఉపశమనం కోసం ఎలా తీసుకోవాలంటే..
Summer Cool Drink
Follow us
Surya Kala

|

Updated on: Mar 17, 2024 | 10:30 AM

వేసవి కాలం వచ్చేసింది. అయితే ఏడాది ఏడాదికి ఎండలు మండుతున్నాయి. వాతావరణంలో వచ్చే మార్పులతో ఉష్ణోగ్రతలు పెరిగడంతో పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా అల్లాడుతున్నారు. వేసవి తాపానికి ,  వడదెబ్బ తగిలి కొందరు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు కూడా.. అయితే వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం వడదెబ్బ తగలకుండా, శరీరం డీ హైడ్రేషన్ గా ఉండడం కోసం కొబ్బరి బొండాలు, చెరకు రసం, జ్యుసి, మజ్జిగ వంటి వాటిని తరచుగా తాగుతూ ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉష్ణోగ్రత కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దీనిని భర్తీ చేసుకోవడానికి మజ్జిగను తరచుగా తీసుకోవాలి. వేసవి తాపం ఉశమనం తో పారు ఆరోగ్యానికి అమృతం వంటిది మజ్జిగ. పెరుగు కంటే వేసవి లో మజ్జిగను తరచుగా తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా శీతల పానీయాల కంటే మజ్జిగ ఎన్నో లాభాలున్నాయి. అయితే ఈ రోజు మజ్జిగను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం..

  1. వేసవికాలంలో రోజూ రెండు సార్లు మజ్జిగ తాగడం వలన ఆరోగ్యానికి మంచిది. అయితే మజ్జిగలో వేయించిన జీలకర్ర కలుపుకుని తాగడం వలన వేసవి తాపం నుంచి ఉపశమనం కలుగుతుంది.
  2. వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం మజ్జిగలో పుష్కలంగా ఉంది. అంతేకాదు రోజూ మజ్జిగను తాగడం వలన  జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.
  3. మజ్జిగలో కరివేపాకు , నిమ్మరసం, ఉప్పు కలిపి తీసుకోవడం వలన దాహార్తి తీరుతుంది.
  4. మజ్జిగలో సొంఠి కలుపుకుని సేవించడం వలన వేసవి నుంచి ఉపశమనం కలుగుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. మజ్జిగలో ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం , దబ్బాకులు, పచ్చి మిర్చి ముక్కలు వేసి సేవించడం వలన దాహార్తి తీరడమే కాదు.. శక్తిని ఇస్తుంది.
  7. వాంతులవుతుంటే మజ్జిగతోపాటు జాజికాయ పొడిని మజ్జిగలో కలుపుకుని సేవించండి.
  8. మజ్జిగలో విటమిన్ బి12, పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం ఉంటాయి. ఇవి శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
  9. మజ్జిగ ఆరోగ్యకరమైన పానీయం. కనుక వేసవిలో కూల్ డ్రింక్స్ కంటే ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ రెండు సార్లు మజ్జిగను తీసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. వీటిని టీవీ 9 ధ్రువీకరించడం లేదు. వైద్యుల సలహాలు, సూచనలు తో పాటించాల్సి ఉంటుంది.