లంచ్ బ్రేక్ లో ఎక్కువ టైం తీసుకుని సాకులు చెబుతున్న మహిళా ఉద్యోగి.. ఉద్యోగం తొలగించిన బాస్
ఒక మహిళా ఉద్యోగి లంచ్ బ్రేక్ సమయం ఎక్కువగా తీసుకున్న సాకుని చూపించి ఆమె బాస్ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. LadBible నివేదిక ప్రకారం ఆస్ట్రేలియాలో నివసిస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీకి బాస్ అయిన ట్రాయ్ హోమ్స్ ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌లో మహిళా ఉద్యోగికి సంబంధించిన కథ షేర్ చేశారు. 2014లో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్న సమయంలో ఒక ఇంటర్వ్యూలో ఒక యువతిని చూసి ఇంప్రెస్ అయ్యి పర్సనల్ అసిస్టెంట్‌ని నియమించుకున్నట్లు బాస్ చెప్పారు.
జీతంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉండే కంపెనీలో పనిచేయాలని అందరూ అనుకుంటారు. అయితే అలాంటి కంపెనీలో ఉద్యోగం దొరకడం కష్టం.. అందరికీ అదృష్టం ఉండదు. ఎందుకంటే చాలా కంపెనీల్లో ఉద్యోగస్తులకు మంచి జీతాలు లభించవు. కొన్ని చోట్ల సౌకర్యాలు ఉండవు. కొన్ని చోట్ల ఉద్యోగులకు పర్యావరణం బాగుండదు. అయితే లంచ్ సమయాన్ని ఎక్కువగా తీసుకుందని ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించారని మీరు ఎప్పుడైనా విన్నారా? అయితే ఇలాంటి కేసు ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చర్చ జరుగుతోంది. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఒక మహిళా ఉద్యోగి లంచ్ బ్రేక్ సమయం ఎక్కువగా తీసుకున్న సాకుని చూపించి ఆమె బాస్ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. LadBible నివేదిక ప్రకారం ఆస్ట్రేలియాలో నివసిస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీకి బాస్ అయిన ట్రాయ్ హోమ్స్ ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌లో మహిళా ఉద్యోగికి సంబంధించిన కథ షేర్ చేశారు. 2014లో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్న సమయంలో ఒక ఇంటర్వ్యూలో ఒక యువతిని చూసి ఇంప్రెస్ అయ్యి పర్సనల్ అసిస్టెంట్‌ని నియమించుకున్నట్లు బాస్ చెప్పారు.
సాకులు చెప్పిన ఉద్యోగిని
హోమ్స్ ప్రకారం యువతిని తన ఉద్యోగిగా నియమించుకున్న కొన్ని వారాల్లోనే ఆమె ప్రవర్తనతో విసుగు చెందినట్లు బాస్ చెప్పాడు. ఎందుకంటే ఆమె తన బాస్ సూచనలను పాటించలేదు. ఆఫీసు నుంచి వెళ్లిపోతుంది. ఒక సమయంలో గంటల తరబడి అదృశ్యమవుతుంది. ఎక్కడికి వెళ్ళావు అని అడిగినప్పుడు రకరకాలుగా ప్రవర్తిస్తుంది. ఆమె రకరకాల సాకులను చెప్పేది. ఒక్కోసారి లిఫ్ట్ రావడానికి చాలా టైం పడుతోందని, క్యాంటీన్‌లో జనాలు ఎక్కువగా ఉన్నారని, అందుకే క్యూలో నిల్చొని భోజనం చేయడం ఆలస్యమైందని ఇలా ఒకొక్కసారి ఒకొక్క రీజన్ చెప్పేది. మధ్యాహ్న భోజనం చేసి తిరిగి పనికి రాకపోవడంతో పాటు ఏదో సాకు చూపుతూ ఇంటికి వెళ్లడం చాలాసార్లు చేసింది.
పడిపోయినట్లు నటిస్తూ ఇంటికి పారిపోయిన ఉద్యోగిని
ఒకరోజు ఆమె పరిమితి దాటి పోయింది.. ఏకంగా భోజన విరామానికి వెళ్లిన తర్వాత తాను కిందపడిపోయానని, లేవలేకపోయానని చెప్పింది. అది విన్న తాను ఆమె ఉన్న ప్లేస్ కు పరిగెత్తుకుని వెళ్లినట్లు అక్కడకు తాను చేసుకునే సరికి.. ఆమె అప్పటికే కారులో బయలుదేరడం తాను చూసినట్లు బాస్ చెప్పారు. అయినప్పటికీ తాను ఉద్యోగిని రీజన్ అడగగా.. తాను తిరిగి త్వరగా పనికి రావడానికి ప్రయత్నించానని అయితే పడిపోయి, లేవలేకపోయానని చెప్పింది. దీంతో సాకుని రీజన్ గా చూపించి ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడానికి చివరి అస్త్రంగా చూపించి ఆమెను ఉద్యోగం నుంచి తొలగించినట్లు చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..