Viral Video: సింహంతో గేదె హోరాహోరీ ఫైట్.. ఈ వీడియో చూస్తే గేదె సాహసానికి సలాం కొడుతారు!

ఎప్పుడైతే భయాన్ని వదిలేస్తామో.. అప్పుడే జీవితం మొదలవుతుంది. ఈ కొటేషన్ మనుషులకే కాదు.. అటవీ జంతువులకు వర్తిస్తుంది. ఓ గేదె తన ధైర్యంతో చంపేయాలనుకున్న సింహాన్ని ఓడించి వెనుకడగు వేయేలా చేసింది. ప్రస్తుతం  ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడూ బలవంతుడు గెలుస్తాడు, ఇది ప్రకృతి ధర్మం.

Viral Video: సింహంతో గేదె హోరాహోరీ ఫైట్.. ఈ వీడియో చూస్తే గేదె సాహసానికి సలాం కొడుతారు!
Viral News
Follow us
Balu Jajala

|

Updated on: Mar 17, 2024 | 8:20 AM

ఎప్పుడైతే భయాన్ని వదిలేస్తామో.. అప్పుడే జీవితం మొదలవుతుంది. ఈ కొటేషన్ మనుషులకే కాదు.. అటవీ జంతువులకు వర్తిస్తుంది. ఓ గేదె తన ధైర్యంతో చంపేయాలనుకున్న సింహాన్ని ఓడించి వెనుకడగు వేయేలా చేసింది. ప్రస్తుతం  ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడూ బలవంతుడు గెలుస్తాడు, ఇది ప్రకృతి ధర్మం. కానీ గుండెల నిండా ధైర్యం ఉంటే అప్పుడప్పుడు బలహీనవంతుడు కూడా గెలుస్తుంటాడు. సరిగ్గా అదే చేసింది గేదె.

ఇప్పటి వరకు, సింహం అడవికి రాజు. మొత్తం అడవిలో ఎవరూ దానిని సవాలు చేయలేరు అనే విషయం మీరు చిన్నప్పటి నుండి వినే ఉంటారు. అయితే దైర్యంగా ముందుకు వెళ్లినవారే యుద్ధరంగంలో విజయం సాధిస్తాడని అడవిని దగ్గరగా తెలిసిన వారు నమ్ముతారు. అయితే ఒక గేదె నిజం చేసి చూపించింది. ఈ వీడియోను ఇప్పటి వరకు వేల మంది వీక్షించారు. వివరాల్లోకి వెళ్తే.. రెండు గేదెలను చంపేందుకు సింహం వాటి వెనుక పరుగెత్తడాన్ని వీడియోలో చూడవచ్చు. రెండు గేదెలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వేగంగా పరిగెత్తాయి.

ఈ సమయంలో వాటిలో ఒకటి ధైర్యంగా వెనక్కి తిరిగి సింహాన్ని ఎదుర్కొంటుంది. గేదె సింహం వైపు వస్తున్న తీరు, దాని ధైర్యాన్ని చూసి సింహం కూడా భయపడిపోయిందని, దాని పరిస్థితి మరింత దిగజారిందని, వెనక్కి తగ్గాల్సి వచ్చిందని అర్థమవుతోంది. ఈ వీడియో @ThebestFigen అనే ఖాతా ద్వారా Xలో పోస్ట్ చేయబడింది. భయం ఎప్పుడు వదులుతామో అప్పుడే జీవితం ప్రారంభమవుతుంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను 82 లక్షల మందికి పైగా వీక్షించారు. మిలియన్ వ్యూస్ వచ్చాయి. మీరూ కూడా ఈ వీడియో చూస్తే బర్రె సాహసానికి సలాం కొడతారు.