AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bakuchiol : చర్మంపై ముడతలతో బాధపడుతున్నారా..! అయితే ఒక్కసారి ఇది ట్రై చేయండి..? ఏ బ్యూటీ క్రీం పనికిరాదు..

Bakuchiol : మీలో ఎవరైనా చర్మంపై గీతలు, ధూళి మచ్చలు, ముడుతలు ఎలా పరిష్కరించాలో చదివితే అప్పుడు

Bakuchiol : చర్మంపై ముడతలతో బాధపడుతున్నారా..! అయితే ఒక్కసారి ఇది ట్రై చేయండి..?  ఏ బ్యూటీ క్రీం పనికిరాదు..
Bakuchiol
uppula Raju
|

Updated on: Jun 01, 2021 | 11:04 AM

Share

Bakuchiol : మీలో ఎవరైనా చర్మంపై గీతలు, ధూళి మచ్చలు, ముడుతలు ఎలా పరిష్కరించాలో చదివితే అప్పుడు రెటినోల్ పేరు తప్పక వినుంటారు. ఇది యాంటీ ఏజింగ్ ఏజెంట్, ఇది చర్మంలో వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి పనిచేస్తుంది. ఈ రోజుల్లో రెటినాల్ ను చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఉపయోగిస్తున్నారు. అయితే దీనికంటే మెరుగ్గా బాకుచియోల్ పనిచేస్తుంది. వృద్ధాప్య లక్షణాలను త్వరగా తొలగిస్తుంది. బాకుచియోల్ అనేది ఒక సహజమైన మొక్క. ఇది యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. వృద్ధాప్య చర్మం, ఇతర చర్మ సమస్యల నుంచి బయటపడటానికి దీనిని ఉపయోగిస్తారు.

1. స్కిన్ టోన్ పెంచడానికి సహాయపడుతుంది బాకుచియోల్ చర్మ సమస్యలకు చక్కగా పనిచేస్తుంది. దీంతో పాటు నల్ల మచ్చలు, వర్ణద్రవ్యం తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా చర్మంలో కొల్లాజెన్ పెంచడానికి తోడ్పడుతుంది. దీని కారణంగా ముఖంపై ముడతలు, మచ్చలు క్రమంగా తగ్గుతాయి.

2. పొడిబారకుండా నిరోధిస్తుంది రెటినోల్ ఇతర చర్మ సంరక్షణ ఉత్పత్తుల వాడకం వల్ల చర్మం పొడిగా మారుతుంది. దురద సమస్య కూడా వస్తుంది. అదే సమయంలో బకుచియోల్ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది ఎలాంటి చికాకు కలిగించదు.

3. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది బాకుచియోల్ చర్మంలో కొల్లాజెన్‌ను పెంచుతుంది. ఇది చర్మం లోపలికి చొచ్చుకొని పోయి చక్కటి ఫలితాలను అందిస్తుంది. క్రమంగా చర్మంలో కొత్త కణాలు ఏర్పడతాయి ఇది మీ అందాన్ని మెరుగుపరచడంతో పాటు మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుంది.

4. ఎలా ఉపయోగించాలి బాకుచియోల్ కలిగి ఉన్న చర్మ సంరక్షణ ఉత్పత్తులు ముఖం, మెడపై వర్తించవచ్చు. మీరు బాకుచియోల్‌ సీరం ఔషదం వలె ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని తేమగా మార్చడానికి సహాయపడుతుంది. మీ చర్మం పొడిగా ఉంటే మీరు బాకుచియోల్ ను ఉపయోగించవచ్చు. దాని భారీ నూనె ఆధారిత సూత్రం చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

White fungus : ఆంధ్రప్రదేశ్‌లో వైట్ ఫంగస్ కలకలం.. కర్నూలు జిల్లా వెలుగోడు మండలంలో వ్యాధి నిర్ధారణ

New Education Policy AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అమ‌ల్లోకి రానున్న నూత‌న విద్యా విధానం.. జ‌రిగే మార్పులు ఇవే..

కుటుంబంలో తీర‌ని విషాదం.. ఈతకు వెళ్లి అన్నదమ్ములు మృతి.. క‌న్నీళ్లు పెట్టిస్తున్న ఆ త‌ల్లి రోద‌న