Success Story: నాడు రూ.150ల జీతంతో వెయిటర్‌.. నేడు దోశ ప్లాజాతో 100 కోట్లకు అధిపతి.. కష్టాల కడలిని ఈదిన గణపతి..

కష్టాల కడలిని ఈది.. తినడానికి లేని స్థితి నుండి 50 సంవత్సరాల వయసులోపే కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తూ చరిత్ర సృష్టించిన ప్రేమ్ గణపతి సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం..

Success Story: నాడు రూ.150ల జీతంతో వెయిటర్‌.. నేడు దోశ ప్లాజాతో 100 కోట్లకు అధిపతి.. కష్టాల కడలిని ఈదిన గణపతి..
Prem Ganapathy
Surya Kala

|

Jun 26, 2022 | 9:21 PM

Success Story: కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహాపురుషులవుతారు అని ఓ సినీ కవి చెప్పాడు.. అవును కృషి,  పట్టుదలే ఆయుధంగా మార్చుకొని.. జీవితంలో ఎంతో ఎత్తుకెదిగి.. నలుగురికి ఆదర్శప్రాయంగా నిలిచిన వారు ఎందరో.. అలా ఓ సామాన్య యువకుడు తన జీవితంను.. నెలకు 150 రూపాయల జీతం నుంచి మొదలు పెట్టి.. కృషితో పట్టుదలతో వందల కోట్ల సంపాదించే స్టేజ్ కు చేరుకున్నాడు.  నిరుపేద కుటుంబంలో పుట్టి.. బతకడం కోసం వెయిటర్ గా పనిచేసి.. నేడు తనకంటూ ఓ వ్యాపార సామ్రాజ్ఞాన్ని సృష్టించుకున్నాడు.. అతనే ప్రేమ్ గణపతి.. కష్టాల కడలిని ఈది.. తినడానికి లేని స్థితి నుండి 50 సంవత్సరాల వయసులోపే కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తూ చరిత్ర సృష్టించిన ప్రేమ్ గణపతి సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం..

తమిళనాడు కు చెందిన ప్రేమ్ గణపతి 17 ఏళ్ల వయసున్నప్పుడు ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చాడు. అలా బయటకు వచ్చిన గణపతి బతకడం కోసం దేశ ఆర్ధిక రాజధాని ముంబై కి చేరుకున్నాడు. ఆకలి కేకలు వెయ్యడంతో ఓ బేకరీలో అంట్లు తోమే పనిలో జాయిన్ అయ్యాడు. ఆ బేకరీ యజమాని ప్రేమ్ కు తిండి పెట్టి.. షల్టర్ ఇచ్చి నెలకు 150 రూపాయలు ఇస్తాను అన్నాడు. దీనికి సరే అన్న ప్రేమ్ పనిలో జాయిన్ అయ్యాడు. అలా రెండు ఏళ్ళు పనిచేశాడు.. అనంతరం మరికొన్ని రెస్టారెంట్స్ లో పనికి కుదురుకున్నాడు.. మరికొన్నాళ్లకు ఫిజా డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు. ఎదుగుబదుగు లేని జీవితం ఎన్నాళ్లు అనుకున్నాడు.. తెలుసున్న వారిదగ్గర చేబదులు తీసుకొని ఓ బండి పై టిఫిన్ అమ్మడం మొదలు పెట్టాడు. రైల్వే స్టేషన్ ముందు నిలబడ్డాడు.. కానీ మున్సిపాలిటీ వారు ఆ బండిని తొలగించారు. అయినా మళ్ళీ బండి పై దోశలను టిఫిన్ వేసి అమ్మడం మొదలు పెట్టేవాడు.. రూమ్స్ మేట్స్ లో చదువు కున్న వారి ద్వారా కంప్యూటర్ నాలెడ్జ్ ను సంపాదించుకున్నాడు. అప్పుడే వ్యాపారం పై దృష్టి పెట్టాడు. ఇంతలో మెక్ డొనాల్డ్ వారు ప్రేమ్ బండి పెట్టుకొనే ప్లేస్ పక్కనే ఓ రెస్టారెంట్ ఓపెన్ చేశారు. అది ఎంత తక్కువ సమయంలో పాపులర్ అయ్యిందో చూశాడు. దీంతో తను కూడా రెస్టారెంట్ పెట్టాలనుకున్నాడు.

1997లో ఓ చిన్న ప్లేస్ ను లీజ్ కు తీసుకొన్నాడు. దానికి నెలకు 5 వేలు రెంట్.. ప్రేమ్ దోశ ప్లాజా అనే పేరుతో రెస్టారెంట్ ను ఓపెన్ చేశాడు. తన దోశ ప్లాజా లో డిఫరెంట్ దోశలను ప్రజలకు పరిచయం చేయాలను కున్నాడు. మొదటి సరిగా 26 రకాల దోశలను పరిచయం చేశాడు. స్ప్రింగ్ రోల్ దోశ, పన్నీర్ చిల్లీ దోశ వంటి డిఫరెంట్ దోశలను ముంబై వాసులకు పరిచయం చేశాడు. దీంతో 2002 నాటికి ప్రేమ్ దోశ అందరికీ ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ అడ్డాగా మారింది. ఇలా 130 వరకూ రకరకాల దోశలు వెయ్యడం మొదలు పెట్టాడు. ఇంతలో గణపతి దోశ ప్లాజా దగ్గర ఓ పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ అయ్యింది. దానిలో ఉన్న మేనేజ్ మెంట్ సిబ్బంది మొత్తం ఇతని రెస్టారెంట్ లోనే టిఫిన్ తినేవారు. ఓ రోజు ఆ షాపింగ్ మాల్ యజమాన్యం తమ షాపింగ్ మాల్ లో స్టాల్ పెట్టమని సలహా ఇచ్చారు. దీంతో ప్రేమ్ గణపతి దశ తిరిగింది.

మన దేశం మొత్తంలో 45 ఔట్ లెట్స్ వెలిశాయి. యూఏయి, ఒమన్, న్యూజిల్యాండ్ ఇలా మొత్తం మూడు దేశాల్లో కలిపి  72 ఇంటర్నేషనల్ ఔట్ లెట్స్ వెలిశాయి. అంతేకాదు ప్రేమ్ కు ఫ్రాంచైజీ రిక్వెస్ట్ లు విదేశాలనుంచి స్వదేశం నుంచి వెళ్లువెత్తాయి. ఒకప్పుడు రూ. 150 జీతంతో బతికిన గణపతి… నేడు కరోడ్ పతి.. 100 కోట్ల సంస్థ అధిపతి.. చిన్న చిన్న కారణాలతో  చదువు, అన్ని సౌకర్యాలు ఉండి కూడా నిరాశగా బతికే నేటి యువతకు ఆదర్శం ప్రేమ్ గణపతి..

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu