AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skincare: ఇన్నాళ్లు పొరపాటు చేశామా?.. బాడీ వాష్ లేదా సబ్బు.. మీ చర్మానికి ఏది బెస్ట్ అంటే!

ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల స్కిన్‌ కేర్ ప్రాడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంతో పాటు అందాన్ని కూడా పెంచుతాయి. ముఖ్యంగా స్నానం చేయడానికి జనాలు బాడీ వాష్, సబ్బులను ఉపయోగిస్తారు. అయితే మీ చర్మ రకాన్ని బట్టి ఈ రెండింటిలో ఏది బెస్టో ఇక్కడ తెలుసుకుందాం.

Skincare: ఇన్నాళ్లు పొరపాటు చేశామా?.. బాడీ వాష్ లేదా సబ్బు.. మీ చర్మానికి ఏది బెస్ట్ అంటే!
Soap Vs Body WashImage Credit source: HiBAR
Anand T
|

Updated on: Aug 28, 2026 | 1:02 PM

Share

మనకు ఊహ తెలిసినప్పటి నుంచి స్నానం చేసేందుకు సబ్బులనే వాడుతున్నాం.. కానీ ఈ మధ్య కాలంలో బాడీ వాషెస్, ఫేష్‌ వాషెస్ అని రకరకాల ఉత్పత్తులు మార్కెట్‌లోకి వచ్చాయి. ఈ రెండూ చర్మంపై ఉండే మురికి, చెమట, అదనపు నూనెను తొలగించడానికి సహాయపడతాయి. కానీ ఈ రెండింటిలో మన చర్మానికి ఏది బెస్ట్.. ఏది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. చర్మ ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి అది ఇప్పుడు తెలుసుకుందాం.

సబ్బుల వల్ల కలిగే ప్రయోజనాలు

చాలా మంది స్నానం చేయడానికి ఎక్కవగా సబ్బులనే ఉపయోగిస్తారు. మార్కెట్‌లో రకరకాల బ్రాండ్‌లకు చెందిన సబ్బులు ఉన్నప్పిటకీ వేప, చందనం, గ్లిజరిన్ వంటివి మూలకాలు కలిగిన సబ్బులే చర్మ ఆరోగ్యానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. సబ్బు వాడడం వల్ల మనకు ఉండే బెనిఫిట్ ఏమింటే ఇది సరసమైన ధరల్లోనే అందుబాటులో ఉంటుంది. అలాగే ఎక్కవ రోజులు వస్తుంది. కానీ సబ్బులు కొనే ముందు మనం ఒక విషయం కచ్చితంగా తెలుసుకోవాలి.. కొన్ని సబ్బులలో pH స్థాయి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాటిని వాడితే చర్మం పొడిబారినట్లు లేదా బిగుతుగా అనిపిస్తుంది. కాబట్టి కొనే ముందు pH స్థాయి చెక్ చేయండి.

బాడీ వాష్ ఉపయోగాలు

సబ్బుతో పోల్చుకుంటే బాడీ వాష్‌ వల్ల ఉపయోగం ఏమిటంటే.. వీటిలో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మాన్ని శుభ్రం చేయడంతో పాటు చర్మంలోని తేమ కోల్పోకుండా కాపాడతాయి. అంతేకాకుండా దీని నుంచి వచ్చే మంచి సువాసన స్నానాన్ని ఆహ్లాదకరంగా, రిలాక్సింగ్‌గా మారుస్తాయి. కానీ సబ్బుతో పోల్చుకుంటే ఇది కాస్త ధర ఎక్కువగా ఉంటుంది. అలాగే త్వరగా అయిపోతుంది.

మీ స్కిన్ రకాన్ని బట్టి ఏది బెస్ట్

ఆయిలీ స్కిన్ వారు: మీది ఆయిలీ స్కిన్ అయినా లేదా మీకు ఎక్కువగా మొటిమలు వస్తున్నా.. గాఢమైన సబ్బుల కంటే వేప లేదా టీ-ట్రీ నూనె వంటి సహజ పదార్థాలు ఉండే మైల్డ్ క్లెన్సర్‌లు చాలా మంచిది. కాబట్టి వీలైనంత వరకు మీరు సబ్బుల కంటే ఈ క్లెన్సర్లను వాడేందుకే ఎక్కవ ప్రాధాన్యత ఇవ్వండి.

పొడి చర్మం ఉన్నవారు: మీ చర్మం పొడిగా ఉన్న లేదా సున్నితమైన చర్మం అయితే ఘాటైన సబ్బులు వాడకండి. ఇవి చర్మంలోని సహజ నూనెలను తొలగిస్తాయి. కాబట్టి వీలైనంత వరకు ఇలాంటి చర్మం ఉన్నవారు మైల్డ్, సువాసన లేని లేదా మాయిశ్చరైజింగ్ బాడీ వాష్‌లనే వాడండి.

మొత్తంగా ఇవి రెండు చర్మ ఆరోగ్యానికి ఉత్తమమే అయినప్పిటికీ మీ చర్మ స్వభావం, బడ్జెట్, వ్యక్తిగత సౌలభ్యాన్ని బట్టి మీరు ఏది సరైనదో దానిని ఎంచుకోవచ్చు.అయితే మీరు స్నానం చేసిన తర్వాత ఏదైనా ఉత్పత్తి వల్ల దురద లేదా మంట కలిగితే దాని వాడకాన్ని వెంటనే ఆపివేయండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us