Jamun Fruit: నేరేడు పండులో ఎన్నో ఆరోగ్య రహస్యాలు.. డోంట్ మిస్!
ఆరోగ్యంగా ఉండాలి అంటే.. ఆరోగ్యంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం కాలంలో చాలా మంది జంక్ ఫుడ్, ప్రోసెస్డ్ ఫుడ్సే ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యాన్ని పెంచే ఫుడ్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. వాటిల్లో నేరేడు పండు కూడా ఒకటి. ఇది శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. నేరేడు పండులో ఎన్నో అద్భుతమైన..

ఆరోగ్యంగా ఉండాలి అంటే.. ఆరోగ్యంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం కాలంలో చాలా మంది జంక్ ఫుడ్, ప్రోసెస్డ్ ఫుడ్సే ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యాన్ని పెంచే ఫుడ్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. వాటిల్లో నేరేడు పండు కూడా ఒకటి. ఇది శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. నేరేడు పండులో ఎన్నో అద్భుతమైన పోషకాలు దాగి ఉన్నాయి. ఈ పండు రుచిగా ఉండటమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇవి సీజనల్ ద్వారా లభించే పండ్లు. కాబట్టి ఇది లభ్యమైతే ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేరేడు పండ్లు తింటే ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.
డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది:
షుగర్ వ్యాధి ఉన్నవారు ఏది తినాలన్నా ఆలోచించాల్సిందే. కానీ నేరేడు పండును మాత్రం ఆలోచించకుండా తినవచ్చు. ఇది తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి కంట్రోల్ అవుతాయి. అందులో జాంబోసిన్ అనే నేచురల్ సమ్మేళనం ఉంటుంది. ఇది షుగర్‌ను కంట్రోల్ చేయడం బాగా సహాయ పడుతుంది.
జీర్ణ క్రియ సాఫీగా:
నేరేడు పండులో పీచు పదార్థాం అనేది మెండుగా ఉంటుంది. జీర్ణ క్రియ సాఫీగా జరగాలంటే ఫైబర్ అనేది ఖచ్చితంగా కావాలి. కాబట్టి నేరేడు పండ్లు తింటే.. జీర్ణక్రియ అనేది మెరుగ్గా ఉంటుంది. ఇవి తినడం వల్ల కడుపుకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తవు. అలాగే మలబద్ధకం సమస్య కూడా కంట్రోల్ అవుతుంది.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:
నేరేడు పండులో విటమిన్ సి అనేది పుష్కలంగా లభ్యమవుతుంది. ఇది తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. దీంతో అంటు వ్యాధులు రాకుండా శరీరాన్ని కాపాడటంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
గుండె ఆరోగ్యం:
నేరేడులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొవ్వు స్థాయిలను కరిగించి.. మంచి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను పెంచుతాయి. దీంతో గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది.
చర్మ ఆరోగ్యం మెరుగు పడుతుంది:
నేరేడు పండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి కాబట్టి.. చర్మం ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. దెబ్బ తిన్న చర్మ కణాలను రక్షించడానికి, ముడతలు రాకుండా నివారించడానికి ఇవి బాగా సహాయ పడతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)








