Eating While Working: వర్క్ చేస్తూ అదే పనిగా చిరుతిళ్లు తింటున్నారా.. చాలా డేంజర్!
సాధారణంగా యువత బయట ఫుడ్‌ను ఎక్కువగా తింటూ ఉంటారు. అలాగే చాలా మంది వర్క్ చేసుకునే ప్లేస్‌లో సైతం.. టైమ్ పాస్ అయ్యేందుకు ఏదో ఒక చిరుతిళ్లను తింటూ ఉంటారు. ఇళ్లలో ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తినడానికి సమయం లేకపోవడంతో.. అప్పటికప్పుడు బయట రెడీగా దొరికే ఫుడ్‌ను తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులోనూ బయట టేస్టీగా ఉంటాయి. కానీ ఆ తర్వాత వీటి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను మాత్రం మర్చిపోతున్నారు. ఇలా వర్క్ చేస్తూ చిరు తిళ్లను తినడం..

సాధారణంగా యువత బయట ఫుడ్‌ను ఎక్కువగా తింటూ ఉంటారు. అలాగే చాలా మంది వర్క్ చేసుకునే ప్లేస్‌లో సైతం.. టైమ్ పాస్ అయ్యేందుకు ఏదో ఒక చిరుతిళ్లను తింటూ ఉంటారు. ఇళ్లలో ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తినడానికి సమయం లేకపోవడంతో.. అప్పటికప్పుడు బయట రెడీగా దొరికే ఫుడ్‌ను తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులోనూ బయట టేస్టీగా ఉంటాయి. కానీ ఆ తర్వాత వీటి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను మాత్రం మర్చిపోతున్నారు. ఇలా వర్క్ చేస్తూ చిరు తిళ్లను తినడం, బయట ఆహారాన్ని తినడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ని అంచనా వేయలేకపోతున్నారు యువత. ముఖ్యంగా ఊబకాయం, డయాబెటీస్, బీపీ, క్యాన్సర్లు, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశలు మెండుగా ఉంటాయి.
ఉదయం టిఫిన్ ముఖ్యం..
సాధారణంగా డైలీ.. టిఫిన్, లంచ్, స్నాక్స్, రాత్రి పూట వయసును బట్టి తిండి అనేది చేయాలి. అది కూడా సమయానికి తినే విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. కానీ ఈ రొటీన్ టైమ్‌ని మొత్తం బ్రేక్ చేస్తున్నారు. హడావిడిగా లేవడంతో.. ఉదయం అల్పాహారాన్ని స్కిప్ చేస్తున్నారు. ఉదయం టిఫిన్ తినడం చాలా ముఖ్యం. లేదంటే కడపులో అనేక రసాయనాలు విడుదలై ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ రసాయనాలు ఫామ్ అవ్వడం వల్ల.. ఇతర అవయవాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.
చిరుతిళ్లను స్కిప్ చేయండి..
చాలా మందికి వర్క్ చేస్తూ చిరు తిళ్లను తినే అలవాటు ఉంటుంది. వీటి వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందులోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక చాలా మంది ఇలానే చేస్తున్నారు. కీ పేడ్ నొక్కుతూ ఆహారం తినడం వల్ల అనేక రకాలైన బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు లోపలికి వెళ్లే ప్రమాదం. దీని వల్ల చాలా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. చిరు తిళ్లు తినడం వల్ల ఆకలి కూడా చచ్చి పోతుంది. దీంతో సమయానికి భోజనం చేయలేరు. దీంతో సమయానికి కడుపులో రిలీజ్ అవ్వాల్సిన ఆరోగ్యకరమైన రసాయనాలు రిలీజ్ కావు. కాబట్టి మీరు ఏదైనా తినాలి అనుకుంటే బ్రేక్ తీసుకోండి. చేతులు వాష్ చేసి మళ్లీ వర్క్ చేయండి. అలాగే భోజనం చేసే సమయానికి ముందు ఏమీ తినకుండా ఉంటే బెటర్.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)








