Alcohol and Tobacco: పొగాకు, మధ్యపానం అలవాట్లు సులువుగా మానేసే చిట్కా.. ఇలా చేస్తే 2 నెలల్లోనే మార్పు!
ధూమపానం, మద్యపానం.. ఈ రెండు అలవాట్లు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయనే విషయం మనందరికీ తెలుసు. కాలేయం, ఊపిరితిత్తులు రోజురోజుకూ బలహీనపడతాయి. తరచుగా అలసట, జీర్ణ సమస్యలు, చర్మ కాంతి కోల్పోవడం వంటి వివిధ సమస్యలు కూడా కనిపిస్తాయి. కానీ వీటిని అదుపు చేయడం అంత సులువుకాదు..

ధూమపానం, మద్యపానానికి బానిసలైన వారు ఈ అలవాటు నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతుంటారు. ఈ రెండు అలవాట్లు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయనే విషయం మనందరికీ తెలుసు. కాలేయం, ఊపిరితిత్తులు రోజురోజుకూ బలహీనపడతాయి. తరచుగా అలసట, జీర్ణ సమస్యలు, చర్మ కాంతి కోల్పోవడం వంటి వివిధ సమస్యలు కూడా కనిపిస్తాయి. కాబట్టి దీనిని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. కానీ ఎలా? అన్నదే అసలు సమస్య. వ్యసనం నుంచి బయటపడటం వాస్తవానికి అది అంత సులభం కాదు. అయితే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ముందుగా.. ప్రతిరోజూ తగినంత నీరు తాగడం ప్రారంభించాలని నిపుణులు అంటున్నారు. నీరు శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలను చేర్చుకోడం అవసరం. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మిల్క్ తిస్టిల్, డాండెలైన్ రూట్ వంటి మూలికా పదార్థాల వాడకం కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. మీ దినచర్యలో నడక, యోగా వంటి తేలికపాటి వ్యాయామాలను కూడా చేర్చుకోవడం మంచిది. అవి శరీరాన్ని చురుగ్గా ఉంచుతాయి. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. క్రమంగా ధూమపానం, మద్యపానం తగ్గించి చివరికి పూర్తిగా మానేయడానికి ఉపయోగపడతాయి.
కొన్ని నెలల్లోనే మీ శరీరం, మనస్సులో గణనీయమైన మార్పులను మీరు గమనిస్తారు. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. మీరు మునుపటి కంటే ఎక్కువ శక్తివంతంగా ఉంటారు. దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తే ఎవరైనా సహజంగానే ఈ చెడు అలవాట్లను మానేసి కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








