Biryani: బిర్యానీ చేస్తే చికెన్ రైస్‌లా తయారవుతుందా.. ఈ 5 మిస్టేక్స్ చేయకుంటే పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ
చికెన్, మటన్, ఫిష్.. ఇలా దేంతో బిర్యానీ చేయాలన్నా ముందుగా అందుకు కావలసిన స్టెప్స్ ను సరిగ్గా ఫాలో అవ్వాలి. అయితే, కొందరు ఎంత బాగా వండినా అది చికెన్ రైస్ లా మారడమో లేక పలావ్ రుచి రావడమో జరుగుతుంది. బిర్యానీ బిర్యానీలాగానే కుదరాలంటే ఈ సారి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.. పర్ఫెక్ట్ బిర్యానీని ఎంజాయ్ చేయండి.

రెస్టారెంట్లు, హోటల్స్ లో దొరుకుతున్న పదార్థాలు ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాక దీర్ఘకాలంలో ఎన్నో వ్యాధులకు కారణమవుతున్నాయి. అందుకు బిర్యానీ వంటి టేస్టీ రెసిపీస్ ను ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు. అయితే, ఎంత ప్రయత్నించినా రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ చేయడం అందరికీ సాధ్యం కాదు. అయితే, మీరు చేసే ఈ 5 రకాల పొరపాట్లే ఇందుకు కారణం. ఈ సారి ఈ మిస్టేక్స్ చేయకుండా బిర్యానీ ట్రై చేయండి.. అదిరిపోయే రుచితో వస్తుంది.
మారినేషన్ చేయకుండా వండటం..
చికెన్‌ను ఫ్రిజ్ నుండి నేరుగా బయటకు తీసి వండేయడం చాలా మందికి అలవాటు ఉంటుంది. కానీ బిర్యానీలో ఇది చాలా ముఖ్యమైన స్టెప్. దీన్ని మరిస్తే బిర్యానీకి రావాలసిన రుచి రాకపోగా.. మీ శ్రమంతా వేస్టవుతుంది. పెరుగు, మసాలాలతో కనీసం 2 గంటలు మెరినేట్ చేయడం వల్ల మాంసం మృదువుగా, రుచిగా మారేలా చేస్తుంది. వీలైతే రాత్రిపూట మెరినేషన్ చేసి వదిలేసి తర్వాతి రోజు వండితే ఇక మీ బిర్యానీ రుచి మరింత అమోఘంగా ఉంటుంది.
అన్నం ఉడకనివ్వకపోవడం..
అన్నం బిర్యానీ రుచికి పునాది వంటిది. దీనిని 70% వరకు మాత్రమే ఉడకనివ్వాలి. అతిగా ఉడికిస్తే గట్టిపడుతుంది, తక్కువ ఉడికించినా గట్టిగా ఉంటుంది. అన్నం వేళ్లతో నొక్కితే విరిగే స్థితిలో, కొద్దిగా పచ్చిగా ఉండాలి. ఇలా చేస్తే అన్నం దమ్ చేసే సమయానికి పూర్తిగా ఉడుకుతుంది. సరైన మోతాదులో బిర్యానీ తయారవుతుంది.
దమ్ చేయడం మరవద్దు..
బిర్యానీకి దమ్ చేయడం అనే పద్ధతి వల్లే ఆ ప్రత్యేకమైన రుచి వస్తుంది. అన్నం, చికెన్‌ను లేయర్‌లుగా అమర్చి, నెమ్మదిగా ఆవిరితో వండడం వల్ల దాని ఫ్లేవర్ ను రుచిని పెంచేస్తుంది. ఈ స్టెప్ ను స్కిప్ చేస్తే బిర్యానీ సాధారణ చికెన్ రైస్‌లా మారుతుంది. ఇది చాలా మంది చేసే మిస్టేక్.
మసాలాలు బ్యాలెన్స్ చేయండి..
బిర్యానీకి మసాలా ముఖ్యమైన పదార్థం. కానీ అతిగా మసాలాలు వాడితే రుచి తీవ్రమవుతుంది, తక్కువైతే సుగంధం తగ్గుతుంది. దాల్చినచెక్క, లవంగాలు, ఏలకులు, బిర్యానీ మసాలా వంటివి సమపాళ్లలో వాడండి. తాజా మూలికలు, వేయించిన ఉల్లిపాయలు రుచిని మరింత పెంచేస్తాయి.
సరైన బియ్యం ఎంచుకోవడం
చిన్న గింజల బాస్మతి లేదా ఇతర రకం అన్నం వాడితే బిర్యానీ గుజ్జుగా మారుతుంది. పొడవైన గింజల బాస్మతి అన్నం ఎంచుకోండి. దీనిని 30 నిమిషాలు నానబెట్టి, ఉడికించే ముందు శుభ్రంగా కడగండి. ఇది అన్నం గింజలను విడిగా, సుగంధభరితంగా ఉంచుతుంది. లేదంటే అందులో ఉండే జిగట పదార్థం బిర్యానీని ముద్దలా మార్చేస్తాయి.
ఈ జాగ్రత్తలు అవసరం..
ఈ మిస్టేక్స్ చేయకుండా ఉండగలిగితే ఇంట్లోనే రుచికరమైన చికెన్ బిర్యానీ తయారు చేయవచ్చు. సరైన మెరినేషన్, అన్నం ఉడకబెట్టడం, దమ్ వంట, మసాలాల సమతుల్యత, బాస్మతి అన్నం ఎంపిక రెస్టారెంట్ రుచిని అందిస్తాయి. రైతా, సలాన్‌తో దీనిని సర్వ్ చేస్తే మరింత టేస్టీగా ఉంటుంది.




