AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kids Health: పిల్లలకు స్మార్ట్ ఫోన్‌ ఇస్తున్నారా.? ఈ భయంకరమైన అపాయం తప్పదు

గంటలతరబడి స్మార్ట్ ఫోన్‌తో కుస్తీ పడితే మెడనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు వస్తాయని ఇప్పటికే నిపుణులు చెబుతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్‌ వినియోగం మానసిక సమస్యలకు కూడా కారణమవుతుందని అంటున్నారు. తాజా పరిశోధనల్లో ఈ విషయం స్పష్టమైంది. ఇక చిన్నారులు కూడా స్మార్ట్‌ ఫోన్‌ను అతిగా ఉపయోగిస్తున్నారు. గేమ్స్‌, వీడియోస్‌తో గంటల తరబడి ఫోన్‌లతోనే...

Kids Health: పిల్లలకు స్మార్ట్ ఫోన్‌ ఇస్తున్నారా.? ఈ భయంకరమైన అపాయం తప్పదు
Kids
Narender Vaitla
|

Updated on: May 11, 2024 | 8:54 PM

Share

స్మార్ట్ ఫోన్‌ వినియోగం ప్రస్తుతం అనివార్యంగా మారింది. మారుతోన్న కాలంతో పాటు స్మార్ట్ ఫోన్‌ లేకుండా ఏ పని ముందుకు సాగడం లేదు. అయితే స్మార్ట్ ఫోన్‌తో ఎన్ని లాభాలు ఉన్నాయో, అదే సమయంలో నష్టాలు కూడా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్‌ వినియోగం ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఇప్పటికే నిపుణులు చెబుతున్నారు.

గంటలతరబడి స్మార్ట్ ఫోన్‌తో కుస్తీ పడితే మెడనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు వస్తాయని ఇప్పటికే నిపుణులు చెబుతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్‌ వినియోగం మానసిక సమస్యలకు కూడా కారణమవుతుందని అంటున్నారు. తాజా పరిశోధనల్లో ఈ విషయం స్పష్టమైంది. ఇక చిన్నారులు కూడా స్మార్ట్‌ ఫోన్‌ను అతిగా ఉపయోగిస్తున్నారు. గేమ్స్‌, వీడియోస్‌తో గంటల తరబడి ఫోన్‌లతోనే గడిపే రోజులు వచ్చేశాయ్‌. శారీరక క్రీడలు పూర్తిగా తగ్గిపోయాయి. స్మార్ట్ ఫోన్స్‌లోనే గేమ్స్‌ ఆడుతున్నారు.

అయితే ఇది చిన్నారులపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్‌ అతిగా వినియోగిస్తే.. చిన్నారుల మానసిక ఆరోగ్యం మీద విపరీత ప్రభావం చూపుతున్నట్టు దక్షిణ కొరియాకు చెందిన హన్యాంగ్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌ అధ్యయనంలో తేలింది. రోజులో నాలుగు గంటలకు మించి స్మార్ట్ ఫోన్‌ ఉపయోగించే యుక్తవయసు పిల్లలకు తీవ్ర నష్టం కలుగుతున్నట్టు పరిశోధనల్లో వెల్లడైంది. స్మార్ట్‌ ఫోన్‌ అతి వినయోగం మానసిక జబ్బులతో పాటు నిద్ర, కళ్లు, ఎముకలకు అంటుకునే కండరాల సమస్యలకూ దారితీస్తున్నట్టు పరిశోధకులు భావిస్తున్ఆనరు.

అంతేకాదు స్మార్ట్ ఫోన్‌ను అతిగా ఉపయోగించే చిన్నారుల్లో కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే అవకాశాలు పెరిగాయని పరిశోధనల్లో తేలింది. అంతేకాదు ఏకంగా ఆత్మహత్య ఆలోచనలు, దురలవాట్లు ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. కాబట్టి పిల్లలను స్మార్ట్ ఫోన్‌లకు దూరంగా ఉంచాలని దాని బదులుగా శారీరక క్రీడలను అలవాటు చేయాలని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..