
ఈ ఏడాది శీతాకాలం దడ పుట్టిస్తుంది. గరిష్ట స్థాయిలో చలి రోజురోజుకూ పెరుగుతోంది. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు చలి నుండి మనల్ని రక్షించుకోవడానికి మనం సహజంగానే ముఖంతో సహా ఒళ్లంతా దుప్పటితో కప్పుకుని నిద్రపోతాం. ఇది ఉష్ణోగ్రతను పెంచడంలో సహాయపడుతుంది. అంతే కాదు ఇది చాలా హాయిగా అనిపిస్తుంది. కానీ ఇటీవలి పరిశోధనల ప్రకారం ఈ రకమైన అభ్యాసం శ్వాసకోశ వ్యవస్థపై గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తుందని తేలింది. రాత్రిపూట ముఖాన్ని కప్పుకోవడం వల్ల శ్వాస, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరించారు. కాబట్టి ఇది ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..
నిద్రపోయేటప్పుడు మన ముఖాన్ని దుప్పటి లేదా బెడ్ షీట్ తో కప్పుకోవడం వల్ల మనం పీల్చే గాలి (కార్బన్ డయాక్సైడ్) అక్కడే చిక్కుకుపోయి బయటకు కోవడానికి స్థలం లేకుండా పోతుంది. ఫలితంగా మనం తెలియకుండానే కార్బన్ డయాక్సైడ్ ను పదే పదే పీల్చుకుంటాం. ఇది శరీరానికి లభించే తాజా ఆక్సిజన్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది ఉదయం నిద్రలేచినప్పుడు తలనొప్పి, రోజంతా అలసిపోయినట్లు అనిపించడం, ఏకాగ్రత లేకపోవడం, నిద్రలో తరచుగా మేల్కొవంటి వంటి సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా ముఖాన్ని కప్పుకోవడం వల్ల ఆ ప్రాంతంలో తేమ, చెమట పేరుకుపోతుంది. దుప్పటిపై ఉన్న దుమ్ము, బ్యాక్టీరియా కూడా చర్మంలోకి రావచ్చు. ఇది మొటిమలు, వాపు వంటి సమస్యలకు దారితీస్తుంది. నిద్రలో శరీర ఉష్ణోగ్రత పెరుగుదల నిద్రకు అంతరాయం కలిగిస్తుంది.
ఉబ్బసం, సైనస్, అలెర్జీ సమస్యలు ఉన్నవారికి ముఖ్యంగా శిశువులకు ఈ అలవాటు చాలా ప్రమాదకరం.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.