Beauty Tips: మెడపై నలుపును చిటికెలో వదిలించే చిట్కాలివిగో.. ట్రై చేసి చూడండి..!
కొంతమందిలో మెడ చుట్టూరా నల్లగా అందవిహీనంగా కనబడుతుంది. అలాంటి సమస్య వున్నవారికి కొన్ని బెస్ట్ హోం రెమిడీస్ అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా ఈ చిట్కాలను పాటిస్తే మెడ చుట్టూ నలుపు త్వరలోనే తగ్గిపోతుందని అంటున్నారు. అవేమిటో ఇక్కడ తెలుసుకుందాము.

మీ మెడనల్లగా మారిందని బాధపడుతున్నారా? ఆ నలుపు తొలగించే బెస్ట్ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. మహిళల్లో చాలా మందికి మెడ వద్ద చర్మం నల్లగా మారుతుంది. ఇది మెడ చుట్టూరా అందవిహీనంగా కనబడుతుంది. అలాంటి సమస్య వున్నవారికి కొన్ని బెస్ట్ హోం రెమిడీస్ అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా ఈ చిట్కాలను పాటిస్తే మెడ చుట్టూ నలుపు త్వరలోనే తగ్గిపోతుందని అంటున్నారు. అవేమిటో ఇక్కడ తెలుసుకుందాము.
2 స్పూన్ల ఓట్స్ పౌడర్‌తో కొద్దిగా పెరుగు కలిపి మెడకు రాసి మసాజ్ చేసి, బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి స్కిన్‌ని క్లెన్స్ చేస్తాయి. ఓట్స్‌లో పెరుగు కలపి మెడ చుట్టూ స్క్రబ్‌లా చేయడం వల్ల మెడ భాగంలో నలుపు తగ్గుతుంది.
బేకింగ్ సోడాతో ప్యాక్ మెడ పైనున్న నల్లని చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో మేలు చేస్తుంది. చర్మంపై మురికిని తొలగించడంలో బేకింగ్ సోడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. చర్మ మృతకణాలను తొలగించి యవ్వనపు కాంతిని అందిస్తుంది. చర్మా్న్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.
బంగాళాదుంప రసాన్ని మెడకు రాసి కొద్దిసేపు అలాగే ఉంచి, తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇందుకోసం ఒక బంగాళాదుంప తీసుకుని పొట్టు తీసి మెత్తగా మిక్సీ పట్టాలి. దీని నుంచి రసం తీయాలి. ఈ రసాన్ని మెడ చుట్టూ నల్లగా ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. ఇది ఆరిన తర్వాత నీటితో క్లీన్ చేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే త్వరలో మార్పును మీరే గమనిస్తారు.
కలబంద చర్మానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. దీనికి చర్మాన్ని కాంతివంతంగా మార్చే సామర్థ్యం ఉంటుంది. మెలనిన్ ఉత్పత్తికి కారణం అయ్యే ఎంజైమ్ చర్యను నిరోదించడం ద్వారా ద్వారా చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. మీ మెడ నల్లగా ఉంటే.. కలబంద గుజ్జును మెడకు అప్లై చేసి..10 నుంచి 15 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చల్లటి నీళ్లతో వాష్ చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తుంటే.. మెడ నలుపు దూరం అవుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








