Black Wheat Flour: నల్ల గోధుమ పిండితో ఈ సమస్యలకు బైబై చెప్పేయండి!

|

Mar 01, 2024 | 3:46 PM

సాధారణంగా గోధుమ పిండి అనంగానే.. లైట్ క్రీమ్ కలర్‌లో ఉంటుంది. కానీ నల్లగా ఉండే గోధుమ పిండిని ఎప్పుడైనా చూశారా.. ఇదిగో ఇప్పుడు తెలుసుకోండి. అసలు నల్ల గోధుమ పిండి కూడా ఉంటుందా అని షాక్ అవుతున్నారా. దీన్ని నల్ల గోధుమల నుంచి తయారు చేస్తారు. ఈ నల్ల గోధుమ పిండిని ఎక్కువగా పురాతన కాలంలో ఉపయోగించుకునేవారు. వేల సంవత్సరాల క్రితం దీన్ని సాగు చేసేవారు. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, క్యాల్షియం, జింక్, పొటాషియం, కాపర్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు..

Black Wheat Flour: నల్ల గోధుమ పిండితో ఈ సమస్యలకు బైబై చెప్పేయండి!
Black Wheat Flour
Follow us on

సాధారణంగా గోధుమ పిండి అనంగానే.. లైట్ క్రీమ్ కలర్‌లో ఉంటుంది. కానీ నల్లగా ఉండే గోధుమ పిండిని ఎప్పుడైనా చూశారా.. ఇదిగో ఇప్పుడు తెలుసుకోండి. అసలు నల్ల గోధుమ పిండి కూడా ఉంటుందా అని షాక్ అవుతున్నారా. దీన్ని నల్ల గోధుమల నుంచి తయారు చేస్తారు. ఈ నల్ల గోధుమ పిండిని ఎక్కువగా పురాతన కాలంలో ఉపయోగించుకునేవారు. వేల సంవత్సరాల క్రితం దీన్ని సాగు చేసేవారు. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, క్యాల్షియం, జింక్, పొటాషియం, కాపర్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు వంటి ఎన్నో రకాల పోషకాలు లభ్యమవుతాయి. సాధారణంగా ఈ నల్ల గోధుమ పిండిని ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. ఎంతో ఆరోగ్యం కూడ. మరి ఈ పిండితో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె సమస్యలు మాయం:

గుండె సమస్యలు ఉన్నవారు ఈ నల్లగా ఉండే గోధుమ పిండిని ఉపయోగించడం వల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉండే కొవ్వు ఆమ్లాు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా అడ్డుకుంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా తగ్గిస్తాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా గుండె పనితీరు కూడా మెరుగు పడుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా చాలా వరకూ తగ్గుతాయి.

డయాబెటీస్‌ వారికి బెస్ట్:

డయాబెటీస్ ఉన్నవారు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడానికి చాలా ఆలోచిస్తారు. కానీ నల్ల గోధుమ పిండిని ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు. ఈ గోధుమ పిండితో తయారు చేసిన ఆహారాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి పెరగకుండా ఉంటాయి. దీని వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.

ఇవి కూడా చదవండి

రోగ నిరోధక శక్తిని పెంచుతాయి:

నల్ల గోధుమ పిండి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. ఇందులో అనేక పోషకాలు శరీరంలో ఇమ్యూనిటీ పెరిగేలా చేస్తాయి. వైరస్‌లు, ఇన్ ఫెక్షన్లతో పోరాడే శక్తి లభిస్తుంది. అంతే కాకుండా డీఎన్ఏ దెబ్బ తినడకుండా రక్షణ ఇవ్వడంలో నల్ల గోధుమలు బాగా పని చేస్తాయి.

రేచీకటిని అడ్డుకుంటాయి:

చాలా మంది రేచీకటి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్య నుంచి బయట పడేయటంలో నల్ల గోధుమలు బాగా పని చేస్తాయి. ఇందులో ఉండే ఆంథోసైనిన్స్ రేచీకటి రాకుండా అడ్డుకుంటాయి. కంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.