Headache Relief Tips: ఇంటి చిట్కాలతో.. నిమిషాల్లోనే తల నొప్పికి బైబై చెప్పండి!
తల నొప్పి వచ్చిందంటే ఒక పట్టాన కుదురుగా ఉండనివ్వదు. ఏకాగ్రత మొత్తం నశిస్తుంది. పని మీద కూడా సరిగ్గా ఫోకస్ చేయలేరు. తలంతా పట్టేసినట్లు.. భారంగా అనిపిస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి వెంటనే మాత్రలను ఉపయోగి్తూ ఉంటారు. అయితే తల నొప్పి అనేది కంప్యూటర్ లేదా ఫోన్లు, టీవీలు ఎక్కువ సేపు చూసినా వస్తుంది. రాత్రి పూట సరిగ్గా నిద్ర లేకపోయినా..
తల నొప్పి వచ్చిందంటే ఒక పట్టాన కుదురుగా ఉండనివ్వదు. ఏకాగ్రత మొత్తం నశిస్తుంది. పని మీద కూడా సరిగ్గా ఫోకస్ చేయలేరు. తలంతా పట్టేసినట్లు.. భారంగా అనిపిస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి వెంటనే మాత్రలను ఉపయోగి్తూ ఉంటారు. అయితే తల నొప్పి అనేది కంప్యూటర్ లేదా ఫోన్లు, టీవీలు ఎక్కువ సేపు చూసినా వస్తుంది. రాత్రి పూట సరిగ్గా నిద్ర లేకపోయినా, తినకపోయినా ఈ తల నొప్పి వస్తుంది. ఇది సాధారణ సమస్యే అయినా.. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఎలాంటి మందులు వాడకుండానే.. ఇంట్లో ఉండే వాటితోనే నిమిషాల్లోనే తల నొప్పికి బైబై చెప్పొచ్చు. అవేంటో ఇప్పుడు చూసేయండి.
అల్లం:
అల్లం అనేది అందరి ఇళ్లల్లో కూడా ఈజీగా లభ్యమవుతుంది. తల నొప్పితో ఇబ్బంది పడుతున్నప్పుడు.. అల్లం టీ తయారు చేసుకుని తాగితే మంచి రిలీఫ్ దొరుకుతుంది. అలాగే మైండ్ కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. అలాగే అల్లం మరిగించిన నీటిని తాగినా మంచి ఉపశమనం ఉంటుంది.
నిమ్మకాయ నీళ్లు:
తలనొప్పిగా ఉన్నప్పుడు నిమ్మకాయ నీళ్లు తాగినా ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. నిమ్మ కాయ నీళ్లలో ఉప్పు కానీ పంచదార కానీ వేసుకోవచ్చు. ఒక్కోసారి గ్యాస్ సమస్య వచ్చినప్పుడు తల నొప్పికి దారి తీస్తుంది. కాబ్టటి నిమ్మకాయ నీళ్లు తాగొచ్చు. అలాగే మీ నుదుటిపై నిమ్మ కాయను కూడా రుద్దుకోవచ్చు.
బ్లాక్ టీ:
బ్లాక్ టీ తాగినా కూడా తల నొప్పికి చెక్ పడుతుంది. అయితే బ్లాక్ టీలో నిమ్మ రసం కలుపుకుని తాగినా తల నొప్పి నుంచి రిలీఫ్ దొరుకుతుంది.
ఐస్ ముక్కలు:
తల నొప్పిగా ఉన్నప్పుడు ఒక కాటన్ క్లాత్‌లో ఐస్ ముక్కలు పెట్టి.. నుదిటిపై కాసేపు నెమ్మదిగా మసాజ్ చేయండి. ఇలా చేస్తే తల నొప్పి తగ్గడమే కాకుండా.. రీఫ్రెషింగ్‌గా కూడా అనిపిస్తుంది.
లవంగం:
తీవ్రమైన తల నొప్పి ఉన్నప్పుడు లవంగంను ఉపయోగించడం వల్ల ఉపశమనం పొందొచ్చు. ఇందులో ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కాబట్టి.. తల నొప్పిని తగ్గిస్తుంది. తల నొప్పిగా ఉన్నప్పుడు లవంగంను నోట్లో వేసుకుని కాసేపు ఉంచండి. ఇలా చేస్తే తల నొప్పి మాత్రమే కాకుండా నోటి దుర్వాసన పోతుంది. దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.