Summer Skin Care: ఎండాకాలంలో వచ్చే దురద, చెమటికాయలకు చెక్ పెట్టండిలా..

వేసవి కాలం వచ్చిందంటే.. చికాకుగా ఉంటుంది. ఎండ, ఉక్కపోతకు జనం అల్లాడి పోతూ ఉంటారు. వేసవిలో ఎక్కువగా చర్మ సమస్యలు కూడా వస్తాయి. దద్దుర్లు, దురదలు, మచ్చలు, చెమట కాయలు, ఎర్రగా మారడం వంటి సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఇవే సమస్యలతో ఇబ్బంది పడేవారు. ఉష్ణోగ్రత వల్ల ఈ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. గాలిలో ఉండే బ్యాక్టీరియా చేరడంతో చర్మంపై ఈ సమస్యలు వస్తాయి. ఈ సమస్య నుంచి బయట పడటానికి చల్లగా..

Summer Skin Care: ఎండాకాలంలో వచ్చే దురద, చెమటికాయలకు చెక్ పెట్టండిలా..
Skin Care In Summer
Follow us

|

Updated on: Apr 19, 2024 | 3:55 PM

వేసవి కాలం వచ్చిందంటే.. చికాకుగా ఉంటుంది. ఎండ, ఉక్కపోతకు జనం అల్లాడి పోతూ ఉంటారు. వేసవిలో ఎక్కువగా చర్మ సమస్యలు కూడా వస్తాయి. దద్దుర్లు, దురదలు, మచ్చలు, చెమట కాయలు, ఎర్రగా మారడం వంటి సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఇవే సమస్యలతో ఇబ్బంది పడేవారు. ఉష్ణోగ్రత వల్ల ఈ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. గాలిలో ఉండే బ్యాక్టీరియా చేరడంతో చర్మంపై ఈ సమస్యలు వస్తాయి. ఈ సమస్య నుంచి బయట పడటానికి చల్లగా ఉండే పౌడర్లను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటితో తాత్కాలిక ఉపశమనమే లభిస్తుంది. కానీ పర్మినెంట్‌గా చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాలు సహజ సిద్ధమైనవి కాబట్టి.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముల్తానీ మట్టి:

ముల్తానీ మట్టి వాడటం వల్ల చర్మం చల్లబడుతుంది. ముల్తానీ మట్టిని ఉపయోగించే ముందు ఓ అరగంట ముందు.. నీటిలో నానబెట్టాలి. తర్వాత దీన్ని నీటిలో నుంచి తీసేసి.. ఇందులో చందనం పొడి వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని శరీరంపై, ముఖంపై రాసుకోవాలి. ఇలా చేస్తే.. చల్లదనంగా ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ వల్ల చర్మంపై ట్యాన్ తొలగిపోతుంది. దీంతో చెమట కాయలు, దద్దుర్లు, దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

వేప నీటి స్నానం:

వేసవి కాలంలో చర్మంపై ఎక్కువగా బ్యాక్టీరియా చేరుతుంది. దీని వల్ల దురద, దద్దుర్లు, చెమట కాయలు వస్తూ ఉంటాయి. దీని వల్ల ఇన్ ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. చర్మంపై చేరిన బ్యాక్టీరియా, ఫంగస్ తొలగించాలంటే.. వేప నీటితో స్నానం చేయాలి. వేపాకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. మీరు స్నానం చేసే ముందు ఓ అరగంట ముందు వేపాకులను నీటిలో వేసి నానబెట్టి.. ఆ తర్వాత స్నానం చేస్తే మంచిది. అదే విధంగా స్నానం చేసే ముందు వేప నూనె రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇన్ ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

బేకింగ్ సోడా:

దురద, దద్దర్లు ఉన్న చోట బేకింగ్ సోడా పేస్ట్ లా చేసి రాయాలి. కొంత సమయం తర్వాత సాధారణ నీటితో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు మూడు రోజులకు ఓసారి చేస్తే.. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..