Fruits: మీరూ పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఆగండాగండీ..
వైద్యుల నుంచి నిపుణుల వరకు అందరూ చెప్పేది.. ప్రతిరోజూ కనీసం ఒక సీజనల్ పండు తినాలని. విటమిన్లు ఎ, బి, సి, ఇ, కాల్షియం, ఇనుము నుంచి పొటాషియం వరకు పండ్లు శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తాయి. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో వివిధ రకాల పండ్లను చేర్చుకోవాలని చెబుతుంటారు..

సీజన్‌ను బట్టి వివిధ రకాల పండ్లు మార్కెట్‌లో ప్రత్యక్షం అవుతాయి. ఖాళీ కడుపుతో నీరు తాగాలి.. కడుపు నిండుగా పండ్లు తినాలని పెద్దలు చెబుతుంటారు. వైద్యుల నుంచి నిపుణుల వరకు అందరూ చెప్పేది.. ప్రతిరోజూ కనీసం ఒక సీజనల్ పండు తినాలని చెబుతారు. విటమిన్లు ఎ, బి, సి, ఇ, కాల్షియం, ఇనుము నుంచి పొటాషియం వరకు పండ్లు శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తాయి. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో వివిధ రకాల పండ్లను చేర్చుకోవాలని చెబుతుంటారు. దాదాపు అన్ని పండ్లు వాటి స్వంత ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అవి అందించే పోషకాలు శరీరానికి చాలా కీలకం. అయితే చాలా మంది పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగుతుంటారు. ఈ పద్ధతి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. దీనివల్ల శరీరానికి వివిధ రకాల సమస్యలు వస్తాయట. పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల ఎలాంటి హాని జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
జీర్ణ సమస్యలు
పండ్లు తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. అజీర్ణం, ఆమ్లత్వం, అపానవాయువు వంటి సమస్యలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఫలితంగా శరీరం పండ్ల పోషకాలను సరిగ్గా గ్రహించలేకపోతుంది. పూర్తి ప్రయోజనాలను కూడా పొందదు. ముఖ్యంగా పుల్లని పండ్లు తిన్న తర్వాత నీరు తాగడం వల్ల జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది.
pH స్థాయిలలో మార్పులు
పండ్లు తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల శరీరంలో నీటి పరిమాణం పెరుగుతుంది. ఇది శరీర pH స్థాయిలో క్షీణతకు కారణమవుతుంది. కొన్ని పండ్లలో చాలా నీరు ఉంటుంది. పండ్లు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల అదనపు నీరు వాంతికి కారణమవుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయ్
పండ్లు తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదిస్తుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మధుమేహానికి దారితీస్తుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లు తిన్న వెంటనే నీరు త్రాగకూడదని గుర్తుంచుకోవాలి.
జలుబు, దగ్గు సమస్యలు
పండ్లు తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల శరీరంలో కఫం పెరుగుతుంది. ఇది దగ్గు, జలుబు, గొంతు నొప్పికి దారితీస్తుంది. పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల దగ్గు వస్తుందని పెద్దలు చెప్పడం మీరు చాలాసార్లు వినే ఉంటారు. భోజనానికి అరగంట ముందు లేదా తర్వాత పండ్లు తినాలి.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.




