Lifestyle: వేగంగా జుట్టు రాలుతోందా.? మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నట్లే..

సాధారణంగా జుట్టు రాలడాన్ని స్కాల్ప్ సమస్యగా భావిస్తారు. అయితే దీనికి అనేక ఇతర కారణాలు ఉండవచ్చు. జుట్టురాలడానికి శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. లూపస్, సిఫిలిస్, థైరాయిడ్, సెక్స్-హార్మోన్ అసమతుల్యత, పోషకాహార సమస్యల వల్ల కూడా...

Lifestyle: వేగంగా జుట్టు రాలుతోందా.? మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నట్లే..
Hair Fall
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 20, 2024 | 3:19 PM

ప్రస్తుతం జీవనశైలిలో మార్పుల కారణంగా జుట్టు రాలడం సర్వసాధారణమైపోయింది. చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు రాలిపోతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వయస్సు పెరుగుతున్న కొద్దీ జుట్టు యొక్క మందం, పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుంది. వృద్ధాప్యం, జన్యుపరమైన, హార్మోన్ల మార్పుల వల్ల జుట్టు రాలుతుంది. కానీ చిన్న వయస్సులోనే జుట్టు వేగంగా రాలడం మాత్రం లైట్‌ తీసుకోవద్దని సూచిస్తున్నారు.

సాధారణంగా జుట్టు రాలడాన్ని స్కాల్ప్ సమస్యగా భావిస్తారు. అయితే దీనికి అనేక ఇతర కారణాలు ఉండవచ్చు. జుట్టురాలడానికి శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. లూపస్, సిఫిలిస్, థైరాయిడ్, సెక్స్-హార్మోన్ అసమతుల్యత, పోషకాహార సమస్యల వల్ల కూడా జుట్టు వేగంగా రాలుతుంది. అంతేకాకుండా ప్రోటీన్, ఐరన్, జింక్ లోపం కూడా జుట్టుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

ఇక ఒత్తిడి లేదా డిప్రెషన్‌లో ఉన్నవారికి కూడా జుట్టు సమస్యలు ఉంటాయని పలు పరిశోధనల్లో తేలింది. అలాంటి వారిలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మనం ఒత్తిడికి గురైనప్పుడు, ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ విడుదల అవుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు అవసరమైన మూలకణాలను దెబ్బతీస్తుంది. దీని వల్ల వెంట్రుకలు బలహీనంగా మారడంతోపాటు విరిగిపోయే ప్రమాదం ఉంది.

థైరాయిడ్‌తో బాధపడేవారిలో కూడా వెంట్రుకలు చిట్లడం, రాలడం వంటి సమస్యలు కనిపిస్తాయి. హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం రెండింటిలోనూ జుట్టు రాలడం సమస్య కావచ్చు . హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్న 50% మంది రోగులలో, హైపోథైరాయిడిజం రోగులలో 33% మందిలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే జుట్టు రాలిపోతుంటే థైరాయిడ్‌ని చెక్ చేసుకోవాలి.

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు అవసరం. రిబోఫ్లావిన్, బయోటిన్, ఫోలేట్, విటమిన్ బి12, విటమిన్-ఈలలో లోపాలు జుట్టు రాలడానికి కారణంగా మారుతాయి. ఆహారంలో జింక్, ప్రోటీన్ వంటి అవసరమైన పోషకాలు లేకపోవడం వల్ల జుట్టు కూడా ప్రభావితమవుతుంది. అటువంటి పరిస్థితిలో, జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా ఉంచడానికి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..