Raksha Bandhan 2023: రాఖీ పండుగకు మంచి గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారా..వంద రూపాయల్లోనే ఇలా ప్లాన్ చేయండి..
Raksha Bandhan 2023 gift ideas: రాఖీ పండుగ రోజు మీ సోదరికి మంచి గిఫ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారా.. ఆ బహుమతి కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నారా...? ఇప్పటికే ఆన్‌లైన్‌లో అన్ని డాట్ కామ్ సెంటర్లను చుట్టేశారా..? షాపులన్నీంట వెతి.. వెతికి అలిసిపోయారా..? ఇంతలా కష్టపడకుండా కేవలం రూ. 100లోనే మంచి గిఫ్ట్ అవ్వవచ్చు. అలా కాకుండా ఇలా చేస్తే మీ సోదరి మనసు దోచుకోవచ్చు. అది ఎలానో ఇక్కడ చూద్దాం..

రాఖీ పండగంటేనే ఓ సందడి. శ్రావణ మాసం పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు. ఈ రోజు కోసం ఏడాదంతా వేచి చూసే సోదరులు, సోదరీమణులు మనలో చాలా మంది ఉంటారు. రాఖీలు, బహుమతుల హంగామా మామూలుగా ఉండదు. సోదరీమణులకు మణిలాంటి బహుమతులు ఇవ్వాలని మనలో చాలా మంది ఆలోచిస్తుంటాం. అది కూడా తక్కువ, ఎక్కువ ధర అని చూడకుండా ఓ మంచి గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటాం. అది కూడా చాలా జాగ్రత్తగా షాపింగ్ చేస్తుంటాం.
అయితే, ఇప్పుడు ఆన్‌లైన్ షాపింగ్ పెరిగిన తర్వాత ఇంట్లో నుంచే ఓ బహుమతిని అందించేందుకు వెతుకుతుంటాం. కాస్త తక్కువ బడ్జెట్లో గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటే కొన్ని మంచి ఆప్షన్లు ఉన్నాయి..
రూ.100లలో రాఖీ పండగ బహుమతులు ఇవే..
1. సెంటెడ్ క్యాండిళ్లు:
గులాబీలు, ల్యావెండర్, వెనీలా వాసనలు ఎవ్వరికి ఇష్టముండవు. వాటి నుంచి వచ్చే వాసన మంచి ప్రశాంతతను ఇస్తుంది.రాఖీ పండుగ రోజున ఇలాంటి గిఫ్ట్ మనసును హత్తుకుంటుంది. వారు ఎలాంటి సువాసనను ఇష్టపడుతారో తెలుసుకుని ఇస్తే మరింత మంచిది. వాళ్ల మనసుకు దోచుకునేందుకు ఈ మంచి బహుమతే కదా.
2. గ్రీటింగ్ కార్డ్:
షాప్‌లో దొరికే ఆర్టీఫిషియల్ గ్రీటింగ్‌లు చాలా మందికి నచ్చవు. అలాకాకుండా మీరే స్వయంగా ఓ గ్రీటింగ్ చేసి ఇవ్వండి. మీరు చెప్పాలనుకున్న విషయాల్ని దాని ద్వారా తెలియజేయండి. మంచి రంగురంగుల పెన్నులతో అందంగా తీర్చిదిద్దండి. డబ్బులతో కొనలేని అమూల్యమైన కానుక అవుతుంది. మీ సోదరిపై మీ ప్రేమను ఈ కార్డు తెలియజేస్తుంది.
3. చాకోలేట్లు, స్వీట్లు:
రాఖీ కట్టిన తర్వాత ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో తెలీకపోతే ఇలా చేయవచ్చు. మీ సోదరి ఎంతో ఇష్టంగా తినే చాకోలేట్లు లేదా స్వీట్లను ప్రేమగా అందించండి. అవి నచ్చని వారు ఎవ్వరూ ఉండరు. మీ బంధాన్ని సూచించే తియ్యని కానుక అవుతుంది. ఇప్పుడు చాలా రకాల చాకోలేట్లు, ఆసక్తికరమైన ప్యాకింగులలో వస్తున్నాయి. వాటిని ఎంచుకోండి.
4. ఫొటో ఫ్రేమ్:
మీ బంధాన్ని.. పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసేది మంచి ఫోటో. అలాంటిదాన్ని ఒకటి ఎంచుకుని సింపుల్‌గా ఫొటో ఫ్రేమ్ చేయించండి. తక్కువ ధరలో ఇవ్వదగ్గ మంచి బహుమతి ఇదే.
5. డైరీ లేదా నోట్ ప్యాడ్:
చిన్న డైరీ లేదా నోట్ ప్యాడ్ ప్రత్యేకంగా కొనుక్కోరు. మీరు కానుకగా ఇస్తే దాన్ని తప్పకుండా ఉపయోగిస్తారు. దాని అవసరం కూడా నిజానికి ఉంటుంది. వాటిలో మంచిదొకటి ఎన్నుకుని బహుమతిగా ఇచ్చేయండి. ఈ మధ్యకాలంలో డిజిటల్ డైరీలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. అందులో పవర్ బ్యాంక్ ఉంటుంది. దీంతో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. లోపల చిన్న స్క్రీన్ కూడా ఉంటుంది. అందులో నోట్ చేసుకోవచ్చు.
6. మొక్క:
ఎదుగుదలను సూచించేది మొక్కలు. వాళ్ల ఎదుగుదలను కోరుతూ ఇచ్చే బహుమతి. ఈ మధ్యకాలంలో మార్కెట్లో చాలా రకాల మొక్కలు లభిస్తున్నాయి. వారు ఇంట్లో పెంచుకుంటారు. అది కనిపిస్తే మీ మధ్య బంధం మరింత పెరుగుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం
