Periods
Physical Relation During Periods: పీరియడ్స్ సమయంలో మహిళల శరీరంలో చాలా మార్పులు కలుగుతాయి. చాలామంది నీరసం, అలసట, నొప్ప తదితర సమస్యలను ఎదుర్కొంటుంటారు. అయితే, పీరియడ్స్ సమయంలో శారీరక సంబంధాలు (ఫిజికల్ రిలేషన్) కలిగి ఉండటం సురక్షితమేనా అనే ప్రశ్న చాలా మంది మహిళల మనస్సులో తరచుగా వస్తుంటుంది. వివాహితలు తరచూ ఈ రకమైన ప్రశ్నతో పోరాడుతూ ఉంటారు. పీరియడ్స్ సమయంలో భాగస్వామితో సంబంధాన్ని కలిగి ఉండటం సురక్షితమా..? లేదా అనేది అధ్యయనంలో ఇంకా నిరూపితంకాలేదు. కానీ, రుతుక్రమం సమయంలో సెక్స్ లో పాల్గొనడం వల్ల ప్రయోజనాలు, నష్టాలు రెండూ ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అయితే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నష్టాలు..
- నిపుణుల అభిప్రాయం ప్రకారం, పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. పీరియడ్స్ సమయంలో శారీరక సంబంధం పెట్టుకోవడం వల్ల యోని పీహెచ్ స్థాయి పెరుగుతుంది. ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది.
- పీరియడ్స్ సమయంలో శారీరక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా, మహిళల్లో హెచ్‌ఐవి వంటి లైంగికంగా సంక్రమించే ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఫిజికల్ రిలేషన్ ఏర్పరచుకునేటప్పుడు ముందుగా మీ భాగస్వామికి ఎలాంటి ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉండకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
- లైంగిక సంక్రమణకు కారణమయ్యే వైరస్లు రక్తంలో కూడా ఉంటాయి. అందుకే పీరియడ్స్ సమయంలో శారీరక సంబంధం పెట్టుకునేటప్పుడు కండోమ్ (ప్రొటెక్షన్) ఉపయోగించడం మంచిది.
ప్రయోజనాలు
- నిపుణుల అభిప్రాయం ప్రకారం, పీరియడ్స్ సమయంలో శారీరక సంబంధం పెట్టుకోవడం వల్ల మైగ్రేన్, తలనొప్పి, తిమ్మిరి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
- అండోత్సర్గము జరిగిన 14 రోజులలో గర్భవతి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ పీరియడ్స్ సమయంలో శారీరక సంబంధం పెట్టుకోవడం ద్వారా గర్భం దాల్చే ప్రమాదం తక్కువ.
- పీరియడ్స్ సమయంలో శారీరక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా, వెన్నునొప్పి, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పి వంటి సమస్యల నుంచి మహిళలు ఉపశమనం పొందుతారు.
- పీరియడ్స్ సమయంలో శారీరక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా, మహిళలు మిగిలిన రోజుల కంటే ఎక్కువగా ఆనందిస్తారు.
- పీరియడ్స్ సమయంలో శారీరక సంబంధం పెట్టుకోవడం వల్ల మహిళల్లో ఎండార్ఫిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి పని చేస్తుంది.
- పీరియడ్స్ సమయంలో శారీరక సంబంధం పెట్టుకోవడం వల్ల రుతుక్రమం కాలపరిమితి తక్కువగా ఉంటుంది.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..