AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Psychology: మీవి కలువల్లాంటి కనులా? అయితే మీ వ్యక్తిత్వం ఇలాంటిదన్నమాట..

శరీరంలోని అతి ముఖ్యమైన అవయవం. భావోద్వేగాలను అర్థం చేసుకునేది కూడా కళ్ళ ద్వారానే. కళ్ళు మనసులోని చాలా ఆలోచనలను వ్యక్తపరుస్తాయి. ప్రతి ఒక్కరి కళ్ళు వేర్వేరు ఆకారాలను కలిగి ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇలా రకరకాల కంటి ఆకారాలు వ్యక్తుల విభిన్న స్వభావాన్ని తెలుపుతాయట..

Psychology: మీవి కలువల్లాంటి కనులా? అయితే మీ వ్యక్తిత్వం ఇలాంటిదన్నమాట..
Eye Shape Personality Test
Srilakshmi C
|

Updated on: Mar 06, 2025 | 8:59 PM

Share

ప్రపంచాన్ని చూడటానికి మనకు సహాయపడే అవయవం కన్ను మాత్రమే. ఇది శరీరంలోని అతి ముఖ్యమైన అవయవం. భావోద్వేగాలను అర్థం చేసుకునేది కూడా కళ్ళ ద్వారానే. కళ్ళు మనసులోని చాలా ఆలోచనలను వ్యక్తపరుస్తాయి. ప్రతి ఒక్కరి కళ్ళు వేర్వేరు ఆకారాలను కలిగి ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇలా రకరకాల కంటి ఆకారాలు వ్యక్తుల స్వభావాన్ని తెలుపుతుంది. కొంతమందికి చిన్న కళ్ళు ఉంటాయి. మరికొందరికి పెద్దవిగా, వెడల్పుగా ఉండే కళ్ళు ఉంటాయి. ఇంకొంతమందికి గుండ్రని కళ్ళు ఉంటాయి. కాబట్టి, ఎలాంటి కళ్ళ ఆకారానికి ఎలాంటి స్వభావం ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..

పెద్దగా విశాలమైన కళ్ళు

పెద్దగా విశాలమైన కళ్ళు ఉన్న వ్యక్తులు విశాలమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు విభిన్న దృక్పథాలను కలిగి ఉంటారు. ప్రతిదాన్ని ఓపెన్‌గా మనస్సుతో అంగీకరించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ వ్యక్తులు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటారు. వీరు చాలా నిజాయితీగా ఉంటారు. ఇతరుల పట్ల అధిక శ్రద్ధ చూపుతారు. వీరు జీవితంలో చాలా విజయవంతమైన వ్యక్తులు. ఏ వ్యాపారం చేపట్టినా, ఏ పని చేసినా కాసుల వర్షం కురుస్తుంది.

చిన్న కళ్ళు

చిన్న కళ్ళు ఉన్నవారు భావోద్వేగానికి ఎక్కువగా లోనవుతారు. ఈ వ్యక్తులు ఏ పని చేసినా నిర్ణీత సమయంలోపు పూర్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటారు. వీరు తెలివైనవారు. ఈ గుణం వారిని సమాజంలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇతరులను అంత తేలికగా నమ్మరు. ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు వందసార్లు ఆలోచిస్తారు.

ఇవి కూడా చదవండి

కలువ ఆకారపు కళ్ళు

బాదం లాగా మధ్యలో కొంచెం వెడల్పుగా రెండు చివర్లు కొనదీరి ఉండే ఈ వ్యక్తులు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ప్రతిదాన్ని ఎదుర్కోగలుగుతారు. అందానికి వీరి కళ్లు ప్రతిబింబాలు. ఈ వ్యక్తులు చాలా మంచి మనసు కలిగి ఉంటారు. అయితే వీరు అందరినీ గుడ్డిగా నమ్ముతారు. ఈ లక్షణం కారణంగా మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కళ్ళ మధ్య అంతరం ఉంటే

కొంతమందికి రెండు కళ్ళ మధ్య పెద్ద అంతరం ఉంటుంది. నిజానికి ఇది శుభ సంకేతం. ఈ రకమైన దూరం ఉన్న వారు తెలివైన వ్యక్తులు. వీరు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తారు. తమ చుట్టూ ఉన్న వారితో కలవడం ద్వారా అందరూ కోరుకునే వ్యక్తులుగా మారతారు.

గుండ్రని కళ్ళు

రెండు కళ్ళు గోళీల మాదిరి గుండ్రంగా ఉంటే.. వీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. వీరి చుట్టూ ఆనందాన్ని వ్యాప్తి చేయడానికి ఇష్టపడతాయి. ఈ వ్యక్తులు సృజనాత్మక కలిగిన వ్యక్తులు. నిరంతరం ఏదో ఒక కార్యకలాపంలో నిమగ్నమై ఉండటానికి ఇష్టపడతారు. వీరు ఆచరణాత్మకం కాని ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. అందువలన ఈ వ్యక్తులు ఎక్కువగా భావోద్వేగాలతో బాధపడుతుంటారు. వీరు అందరినీ ప్రేమించే గుణం కలిగి ఉంటారు. వీరిలోని ఈ ప్రత్యేక వ్యక్తిత్వమే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.